బర్త్ డే విషెస్ చెప్పిన బోయ్ ఫ్రెండ్ కు జాహ్నవి ఐ లవ్ యూ

First Published 6, Mar 2018, 4:59 PM IST
SRIDEVI DAUGHTER JHAHNVI SAYS ILU TO BOY FRIEND
Highlights
  • శ్రీదేవి మరణంతో విషాదంలో జాహ్నవి
  • రేపే జాహ్నవి పుట్టినరోజు
  • విష్ చేసిన బోయ్ ఫ్రెండ్ కు ఐ లవ్ యూ అంటూజాహ్నవి రిప్లై

దివంగత నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నేటితో 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. తల్లిని కోల్పోయిన విషాదంలో ఉన్న జాహ్నవి కపూర్‌కు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషెర్స్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జాహ్నవి కపూర్ బాయ్ ఫ్రెండ్ అక్షత్ రంజన్ కూడా జాహ్నవిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విష్ చేశారు. 

జాహ్నవి బాయ్ ఫ్రెండ్ అక్షత్ రంజన్ జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలసి దిగిన ఫోటోను పోస్టు చేశాడు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ కామెంట్ పోస్టు చేశాడు. ఐ లవ్ యూ అంటూ జాహ్నవి రిప్లై అక్షత్ రంజన్ బర్త్ డే విషెష్‌పై.... జాహ్నవి కపూర్ వెంటనే స్పందించారు. ILY (ఐ లవ్ యూ) అంటూ రిప్లై ఇచ్చారు. తల్లి చనిపోయిన సమయంలో విషాదంలో ఉన్న జాహ్నవికి అక్షత్ రంజన్ ఎమోషనల్‌గా చాలా సపోర్టుగా ఉన్నారు. 

కపూర్ ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్. శ్రీదేవి బ్రతికున్న సమయంలో బోనీ కపూర్ ఫ్యామిలీ ఔటింగ్‌కు వెళ్లిన సమయంలో అక్షత్ రంజన్ కూడా వారితో కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. గౌరీ షిండే దర్శకత్వంలో వచ్చిన ‘డియర్ జిందగీ' మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో శ్రీదేవి, బోనీ కపూర్, జాహ్నవిలతో కలిసి ఒకే కారులో అక్షత్ రంజన్ కనిపించడం అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 

అక్షత్ రంజన్ ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడు. ముంబైలో స్కూల్ డేస్ నుండే అక్షత్, జాహ్నవి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పటి నుండే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. కపూర్ ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యాడు. జాహ్నవికి ఉన్న స్నేహితుల్లో అక్షత్ రంజన్ చాలా స్పెషల్ అని అంటుంటారు.

loader