Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్ న్యూస్ : శ్రీదేవి మృతదేహాన్ని తరలింపు ఇవాళ కూడ కష్టమే..

  •  శ్రీదేవి మృతదేహాన్ని తరలింపు ఇవాళ కూడ కష్టమే..
  • దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసే నివేదిక గురించి శ్రీదేవి కుటుంబ సభ్యులు వేచిచూస్తున్నారు.​
sridevi body is not coming today also

ప్రముఖ నటి శ్రీదేవి మృతదేహాన్ని స్వదేశానికి తరలింపుకు అన్ని రకాల ప్రక్రియలు పూర్తయితే తప్ప ఆమె దేహాన్ని అప్పగించలేమని దుబాయ్ అధికారులు వెల్లడిస్తున్నారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసే నివేదిక గురించి శ్రీదేవి కుటుంబ సభ్యులు వేచిచూస్తున్నారు.దర్యాప్తు ప్రక్రియ తీరు గురించి మాట్లాడటానికి దుబాయ్ అధికారులు నిరాకరిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకు మించి తాము ఏమీ చెప్పలేము అని వారు పేర్కొంటున్నారు. శ్రీదేవి మృతదేహం అప్పగింత వ్యవహారంలో మంగళవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి పురోగతి కనిపించకపోవడం బంధువులను వేదనకు గురిచేస్తున్నది.దుబాయ్ పోలీసులు సాధారణంగా అనుసరించే పద్దతులనే పాటిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరుగడం లేదు. హాస్పిటల్‌లో చనిపోతే ఈ ప్రక్రియ మరింత సులభం అయ్యేది. హోటల్‌లో చనిపోవడం వల్ల అనేక రకాలుగా దర్యాప్తు చేయాల్సి వస్తున్నది అని భారతీయ అధికారులు పేర్కొన్నారు.శ్రీదేవి మృతదేహం దుబాయ్ మార్చురిలో ఉంచారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్లియరెన్స్ లభిస్తే గానీ, ముహైస్నాలోని ఎంబాల్మింగ్ యూనిట్‌కు తరలిస్తాం అని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. అయితే శ్రీదేవి మృతదేహాన్ని మంగళవారం ముంబైకి తరలించే అవకాశాలు చాలా కష్టంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్న. దుబాయ్ ప్రాసిక్యూషన్ కేసులో తీవ్రత ఉన్నట్టు భావిస్తే తరలింపు ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.అన్ని ప్రక్రియలు ముగిసిపోయిన అనంతరం ఆమె భౌతికకాయాన్ని ఛార్టర్డ్‌ విమానంలో ముంబయికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ జెట్ విమానాన్ని పంపిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios