శ్రీదేవికి ఆ హీరోతో సినిమా చేయలనే కోరిక ఉండేదట.. ఇంతకి ఆ హీరో ఎవరు.?

Sridevi and boney kapoor had a plan to do a movie with ajith
Highlights

  • తెలుగు, తమిళ, హిందీ, అనే భాషల తేడా లేకుండా అందరి హీరోలతో ఆమె నటించింది
  • బోనీకపూర్ లకు ఒక కోరిక ఉండేదట..కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె స్వర్గస్తురాలైంది

అతిక లోక సుందరి ఆల్ మోస్ట్ అందరి హీరోలతో నటించింది. తెలుగు, తమిళ, హిందీ, అనే భాషల తేడా లేకుండా అందరితో నటించింది. కానీ శ్రీదేవి బోనీకపూర్ లకు ఒక కోరిక ఉండేదట. కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె స్వర్గస్తురాలైంది. ఇంతకి శ్రీదేవి కోరిక ఏంటంటే ఎలాగైన అజిత్ ఒక సినిమా తీయాలనే కోరిక ఉండేదట. తమిళ హీరో అజిత్ కూడా శ్రీదేవి ఫ్యామిలీకి మంచి సన్నిహితుడు. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో అజిత్ గెస్ట్ రోల్ లో నటించాడు.

అజిత్ హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించాలని చాలా రోజుల క్రితమే బోనికపూర్, శ్రీదేవి అనుకున్నారట. కానీ అజిత్ బిజీగా ఉండడంతో కుదరలేదు. అంతలోనే శ్రీదేవి మరణించారు. కాగా శ్రీదేవి మరణం తరువాత ఈ చిత్రంలో తొలి అడుగు పడినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.అజిత్ తో సినిమా చేయాలని బోనికపూర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు ప్రాధమిక దశలోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందబోయే విశ్వాసం చిత్రంతో బిజీకాబోతున్నాడు. ఈ నెల నుంచే ఈ చిత్రం పార్రంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తరువాత అజిత్ బోనికపూర్ నిర్మాణంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బోనికపూర్ నిర్మాణంలో నటిస్తానని అజిత్ గతంలో శ్రీదేవి సమక్షంలో హామీ ఇచ్చాడట. కానీ ప్రాజెక్ట్ మొదలయ్యే సమయానికి శ్రీదేవి అనూహ్యంగా మృతి చెందారు. బోని కపూర్ ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యంతో సినిమా చేయడానికి అజిత్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

loader