పవన్ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి

పవన్ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి

పవన్ కల్యాణ్ ను శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో దూషించడం టాలీవుడ్ తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర కలకం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాను వర్మ సలహా ప్రకారమే అలా తిట్టానని - పవన్ కు ఆయన తల్లికి బహిరంగా క్షమాపణలు చెబుతున్నానని శ్రీరెడ్డి ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. కానీ పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి మీద చాలా కోంతో ఊగిపోతున్నారు.

ఈ పరిణామాలు ఇలా ఉండగా తాజాగా శ్రీరెడ్డి పవన్‌ అభిమానులను హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. తన ఫేస్‌బుక్‌ పేజీ పోలీసుల నిఘాలో ఉందని, బెదిరించేవాళ్లు, ట్రోలింగ్‌ చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఆమె పోస్టు చేశారు. ‘నా ఫేస్‌బుక్‌ పేజీ పోలీసుల నిఘాలో ఉంది. కాబట్టి జాగ్రత్త. వ్యక్తులను బ్లాక్‌ చేయడాన్ని నేను ఆపేశాను. పవన్‌ అభిమానులు ఎంతగా బెదిరిస్తున్నారో.. ట్రోల్‌ చేస్తున్నారో అందరికీ చూపించాలని మేం అనుకుంటున్నాం. ఎన్‌హెచ్‌ఆర్సీ (జాతీయ మానవహక్కుల కమిషన్‌) మాకు మద్దతుగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ మీడియా గమనిస్తోంది. కమాన్‌.. బ్యాడ్‌ కామెంట్స్‌ చేయండి’ అంటూ ఆమె పేర్కొన్నారు. టాలీవుడ్‌ పెద్దలు తెలివైన గేమ్స్‌ ఆడుతూ.. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మరో పోస్టులో ఆమె పేర్కొన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos