ఇండస్ట్రీలో ఉన్న వెధవల్లారా.. జరభద్రం ఎవడికైనా చెప్పుదెబ్బలు తప్పవు

Sri reddy warning to industry biggies
Highlights

ఇండస్ట్రీలో ఉన్న వెధవల్లారా.. జరభద్రం ఎవడికైనా చెప్పుదెబ్బలు తప్పవు

టాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సంచలన వీడియోను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్న రసికరాజులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘సినిమా ఇండస్ట్రీలో ఉన్న వెధవల్లారా.. జరభద్రం, ఖబడ్దార్ ఎవడికైనా చెప్పుదెబ్బలు తప్పవు’ అంటూ ఘాటుగా తనదైన శైలిలో హెచ్చరించింది. 

ఓ బాధితరాల తరపున పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్రీరెడ్డి . శ్రీశాంత్ రెడ్డి అనే వ్యక్తి కో ఆర్డినేటర్ గా పని చేస్తున్నాడు. అతనికి ఓ జూనియర్ ఆర్టిస్ట్ పరిచయమయ్యింది. ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కుదరడంతో బోరబండ లోని తన ఇంటికి తీసుకెళ్లాడట. అక్కడ చాలా సార్లు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని ఆ ఆర్టిస్ట్ ఆరోపిస్తుంది. అంతేకాదు తన దగ్గర ఉన్న డబ్బుకూడా లాక్కొని పారిపోయాడట. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. వాట్సప్ లో జూనియర్ ఆర్టిస్ట్ తో పాటు కో ఆర్డినేటర్స్ సర్కిల్ లో తిరుగుతోంది. ఇది అంతా అబద్దమని తన పరువు తీస్తోందని బంజారహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు  శ్రీశాంత్ రెడ్డి . 

ఫిర్యాదు రాస్తున్న సమయంలోనే శ్రీరెడ్డి తో కలసి అదే టైం కి స్టేషన్ కి వచ్చింది. ఆమెతో పాటు మరికొంతమంది ఆర్టిస్ట్ లు ఉన్నారు. శ్రీరెడ్డి సపోర్ట్ చూసుకొని ఒక్కసారిగి శ్రీశాంత్ రెడ్డి పై దాడి చేసింది. ఇటు శ్రీరెడ్డి తో పాటు మిగతా మహిళలు కూడా  శ్రీశాంత్ రెడ్డి మీద దాడికి దిగారని సమాచారం. ఇంతలోనే పోలీసులు అడ్డుకున్న కూడా వాళ్లు ఏమాత్రం తగ్గలేదు. ఒక మహిళ ఏకంగా ఎస్ఐ టేబుల్ ఎక్కి మరి దాడి చేసింది. ఆ మహిళల ఓవర్ యాక్షన్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. 

ఈ సందర్భంలో అక్కడ జరిగిన తతంగాన్ని వీడియో తీసిన శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ద్వారా ఆ వీడియోను పోస్ట్ చేసింది. అక్కడ జరిగిన విషయాన్ని తెలియజేస్తూ.. ఇండస్ట్రీలో ఇలాంటి వెధవలు ఎవరున్నా చెప్పుదెబ్బలు తప్పవని.. మోసం చేయాలని చూశాడు అందుకే పెళ్లి చేశాం.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించింది శ్రీరెడ్డి.

loader