MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Yellamma: ఎల్లమ్మ ఫస్ట్ లుక్, దేవీశ్రీని కంప్లీట్ గా మార్చేశారు.. పెద్ద ప్లానే ఇది, మరో రెండు సర్ప్రైజ్ లు

Yellamma: ఎల్లమ్మ ఫస్ట్ లుక్, దేవీశ్రీని కంప్లీట్ గా మార్చేశారు.. పెద్ద ప్లానే ఇది, మరో రెండు సర్ప్రైజ్ లు

దేవిశ్రీ ప్రసాద్ 47వ పుట్టినరోజు సందర్భంగా ‘ఎల్లమ్మ’ చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పర్షి పాత్రలో డీఎస్పీ రస్టిక్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 02 2026, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎల్లమ్మ ఫస్ట్ లుక్
Image Credit : Asianet News

ఎల్లమ్మ ఫస్ట్ లుక్

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కు ఈ ఆదివారం ప్రత్యేకమైన రోజుగా నిలిచింది. ఆయన 47వ పుట్టినరోజు సందర్భంగా పలువురు దర్శకులు, నిర్మాతలు తమ కొత్త చిత్రాలకు డీఎస్పీ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ‘ఎల్లమ్మ’ చిత్రబృందం మరింత ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ఇస్తూ, ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కంప్లీట్ గా మారిపోయిన దేవిశ్రీ
Image Credit : our own

కంప్లీట్ గా మారిపోయిన దేవిశ్రీ

చిత్రబృందం డీఎస్పీని ‘పర్షి’ పాత్రలో పరిచయం చేసింది. ఈ పోస్టర్‌లో దేవిశ్రీ ప్రసాద్ రస్టిక్ అవతార్‌లో కనిపిస్తున్నారు. భుజాల వరకు ఉండే పొడవాటి జుట్టు, పాతకాలపు గెటప్‌తో పాటు గ్రామీణ నేపథ్యంలో అలంకరించిన కిరీటాన్ని చేతిలో పట్టుకుని కనిపించడం ఆకట్టుకుంటోంది. దర్శకుడు వేణు యెల్దండి ఈ సినిమా కోసం సృష్టించిన గ్రామీణ ప్రపంచాన్ని ఈ ఫస్ట్ లుక్ సూచిస్తోంది. ఫస్ట్ లుక్ లో దేవిశ్రీ ప్రసాద్ ని కంప్లీట్ గా మార్చేశారు. ఆ క్రెడిట్ డైరెక్టర్ వేణుకే చెందుతుంది. బలగం తర్వాత వేణు తెరకెక్కిస్తున్న సినిమా ఇది. చూస్తుంటే ఏదో భారీ స్థాయిలోనే వేణు ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు.

The birth of an actor...
On the day of his birth ❤️‍🔥

A name called PARSHI.
A world called #Yellamma.
A journey we are all waiting to witness 🔥#HBDDeviSriPrasad #SVC61 Rockstar @thisisdsp @VenuYeldandi9 #DilRaju #Shirish @muraligdop @Hr_3555 #HanshithaReddy @svc_official… pic.twitter.com/9yo6QzBN8X

— Sri Venkateswara Creations (@SVC_official) August 2, 2026

35
ఆసక్తి పెంచుతున్న బిజీయం
Image Credit : Asianet News

ఆసక్తి పెంచుతున్న బిజీయం

ఫస్ట్ లుక్ గ్లింప్స్‌కు జత చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోస్టర్‌లో కనిపించే వాతావరణానికి తగ్గట్టుగా సంగీతాన్ని రూపొందించినప్పటికీ, పాత్రకు సంబంధించిన కీలక వివరాలను మాత్రం మేకర్స్ గోప్యంగానే ఉంచారు. ఫస్ట్ లుక్ మినహా సినిమా గురించి ఇతర విషయాలను ఇంకా వెల్లడించలేదు.

#Yellamma... and in it a man called PARSHI ❤️‍🔥

Presenting the ACTOR @ThisIsDSP in a role rooted in the soil with a name you will remember and a journey you will never forget 🔥

We always celebrate his music... Along with that, let's celebrate him on the silver screen too 😍… pic.twitter.com/zLsdRarC5G

— Sri Venkateswara Creations (@SVC_official) August 2, 2026

45
దిల్ రాజు నిర్మాణంలో..
Image Credit : Asianet News

దిల్ రాజు నిర్మాణంలో..

‘బలగం’ చిత్రంతో గుర్తింపు పొందిన వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

55
మరో రెండు బిగ్ సర్ప్రైజ్ లు
Image Credit : Asianet News

మరో రెండు బిగ్ సర్ప్రైజ్ లు

దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే కావడంతో ఎల్లమ్మతో పాటు మరో రెండు భారీ సర్ప్రైజ్ లు కూడా అభిమానులకు అందాయి. కింగ్ నాగార్జున 100 చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కంఫర్మ్ అయ్యారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మాస్, కింగ్, మన్మథుడు లాంటి నాగార్జున సూపర్ హిట్ చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఇప్పుడు కెరీర్ లో మైలురాయి లాంటి 100 చిత్రానికి కూడా దేవిశ్రీపైనే నాగ్ నమ్మకం ఉంచారు. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ హీరో కార్తీ 30వ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీకి కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడిగా ఖరారు అయ్యారు. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి ఇక తాతగా నటించాలి అని గుచ్చి గుచ్చి అడిగారు, ఒక్క ఆన్సర్ తో అంతా నోర్లు మూసుకున్నారు
Recommended image2
Rajasekhar: రంభ, సౌందర్య హీరోయిన్లు.. రాజశేఖర్ అలాంటోడని తెలిసి కూడా సినిమా చేశా, కెరీర్ నాశనం చేసుకున్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved