సమస్యలు కొని తెచ్చుకోకండి: శ్రీరెడ్డి వార్నింగ్

First Published 23, Jul 2018, 3:12 PM IST
Sri Reddy To Meet Nadigar Sangam Members
Highlights

ఇది డొమెస్టిక్ వయొలెన్స్, ఈవ్ టీజింగ్ సెక్షన్స్ 294, 509, అఫెన్సివ్ ప్రోపగండా యాక్ట్ 1986, ఐపీసీ సెక్షన్ 498ఏ కిందకి వస్తుంది. అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకోవద్దు. 

కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులపై కామెంట్స్ చేసిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ తారలను టార్గెట్ చేసింది. ఇటీవల చెన్నైకి వెళ్లిన ఆమె అక్కడ ప్రముఖులపై ఆరోపణలు చేస్తుంది. ఈ విషయంలో న్యాయం కోసం నడిగర్ సంఘం వద్దకు వెళ్లాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది.

''నడిగర్ సంఘంతో మాట్లాడబోతున్నాను. నా సమస్యలను వారికి వినిపించాలనుకుంటున్నాను. మహిళల సమస్యపైనే మాట్లాడతాను. నేను నాజర్ గారిని పిలిచాను. ఏం జరుగుతుందో చూడాలి. ప్రెస్ మీట్ లో లేదంటే మీడియా ద్వారా ఎవరైనా నాపై, ఇతర మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చట్టమే శిక్షిస్తుంది. ఇది డొమెస్టిక్ వయొలెన్స్, ఈవ్ టీజింగ్ సెక్షన్స్ 294, 509, అఫెన్సివ్ ప్రోపగండా యాక్ట్ 1986, ఐపీసీ సెక్షన్ 498ఏ కిందకి వస్తుంది.

అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకోవద్దు. నేను మాట్లాడిన విషయాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. సత్యమేవ జయతే.. జైహింద్'' అంటూ రాసుకొచ్చింది. 

loader