హీరో నాని తనను సెక్సువల్ గా వాడుకొని వదిలేసినట్లు నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పుకుంటోన్న శ్రీరెడ్డి తాజాగా నటుడు నానిపై విరుచుకుపడింది.

''మూడు నెలలుగా ఖాళీగా ఉన్నాను.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ వచ్చింది. నేను కూడా చేయాలనుకున్నాను కానీ నాని ఒత్తిడి వల్ల చివరి నిమిషంలో నిర్వాహకులు నన్ను తప్పించారు. గతంలో నాని తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నన్ను సెక్సువల్ గా వాడుకొని వదిలేశాడు. ఇప్పుడేమో అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్నాడు. ఉప్పలపాటి రవి అనే నిర్మాతతో కలిసి చేయబోయే సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని అన్నాడు. డ్రగ్స్ విషయంలో కూడా తన ఇన్వాల్స్మెంట్ ఉంది. నాని విషయం బయటకి చెప్పడానికి భయపడ్డాను కానీ ఆధారాలు లేకపోయినా కోర్టుకి నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోమని మా లాయర్ చెప్పడంతో నాని పేరు బయటపెడుతున్నా.. నాని తను నటించే ప్రతి సినిమా విషయంలో పూర్తిగా జోక్యం చేసుకుంటాడు. హీరోయిన్ ఎంపిక కూడా అతడిపై ఆధారపడి ఉంటుంది. సాయి పల్లవిని కూడా సెట్స్ పై ఇబ్బంది పెట్టాడు. పైకి మంచివాడిలా నటిస్తాడు కానీ పొగరుబోతు. చాలా మంది అమ్మాయిలను వాడుకున్నాడు. నాని నా మీద చేయి వేయలేదని తన కొడుకు మీద ఒట్టు వేసి చెప్పమనండి'' అంటూ సవాల్ చేసింది.

ఇక ఈ విషయంపై స్పందించిన నాని 'ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు ఇవి. వీటిపై నేను స్పందించాల్సిన అవసరం లేదని' అన్నారు. బిగ్ బాస్2 లో పోటీదారుల ఎంపికలో నాని ప్రమేయం లేదని షో నిర్వాహకులు తెలిపారు.