సందీప్ కిషన్ పెద్ద ఫ్రాడ్.. ప్రతి మహిళను కోరుకుంటాడు: శ్రీరెడ్డి

sri reddy sensational comments on sundeep kishan and sundar c
Highlights

టాలీవుడ్ హీరో అయినప్పటికీ సందీప్ కిషన్ కు తమిళంలో మంచి గుర్తింపు లభించింది. అటువంటి హీరో చాలా పెద్ద ఫ్రాడ్ అని అతడిపై సంచలన ఆరోపణలు చేసింది. సందీప్ లాంటి వాడు భూమికి భారమని అతడి కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు వెల్లడించింది. ఇక అతడి ప్రతి మహిళను కోరుకుంటాడని షాకింగ్ కామెంట్స్ చేసింది

ఇప్పటివరకు శ్రీలీక్స్ అంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలను, దర్శకులను, నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఎన్నో ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ పై పడింది. తమిళ్ లీక్స్ పేరుతో అక్కడ హీరోలు,దర్శకులపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ముందుగా మురుగదాస్, లారెన్స్ వంటి తారలపై కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి తాజాగా నటుడు సందీప్ కిషన్ పై విరుచుకుపడింది.

టాలీవుడ్ హీరో అయినప్పటికీ సందీప్ కిషన్ కు తమిళంలో మంచి గుర్తింపు లభించింది. అటువంటి హీరో చాలా పెద్ద ఫ్రాడ్ అని అతడిపై సంచలన ఆరోపణలు చేసింది. సందీప్ లాంటి వాడు భూమికి భారమని అతడి కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు వెల్లడించింది. ఇక అతడి ప్రతి మహిళను కోరుకుంటాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. అలానే తమిళ స్టార్ డైరెక్టర్ సుందర్ సి తనను శారీరకంగా వాడుకున్నట్లు మరో పోస్ట్ లో చెప్పుకొచ్చింది.

ఓ తమిళ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అతడు తన నిర్మాత సహాయంతో నోవెటల్ హోటల్ కు రప్పించి అవకాశం ఇప్పిస్తానని చెప్పి సెక్సువల్ గా తనను వాడుకొని అవకాశం ఇవ్వకుండా మోసం చేశారని వెల్లడించింది. తమిళ్ లీక్స్ పేరుతో ఆమె చేస్తోన్న రచ్చ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజేందర్ లాంటి దర్శకులు శ్రీరెడ్డిని సపోర్ట్ చేస్తూ ఆమె ఆరోపణలు చేస్తున్న వారు ఈ విషయంపై స్పందించాలని కోరారు. మరి ఈ వివాదంలో ఇంకెంతమంది తారలను ఇన్వాల్వ్ చేస్తుందో చూడాలి!

loader