టాలీవుడ్ ఎంగిలి మెతుకులు తిన్న నీవు ఎందుకు పట్టించుకోవు పవనన్నా : శ్రీరెడ్డి

First Published 12, Apr 2018, 4:46 PM IST
Sri reddy sensational comments on pawan kalyan
Highlights
టాలీవుడ్ ఎంగిలి మెతుకులు తిన్న నీవు ఎందుకు పట్టించుకోవు పవనన్నా : శ్రీరెడ్డి

శ్రీ‌రెడ్డి ఎవ్వరిని వదిలి పెట్టట్లేదు సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాన్ గురించి మాట్లాడుతూ..నేడు టాలీవుడ్‌లో ఇంత పెద్ద విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతున్నా కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించ‌క‌పోవ‌డం పై ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇంత‌కాలం ఫిలిం ఇండస్ట్రీలో బతుకుతూ... సినిమా పెట్టిన మెతుకులు తింటూ.. ఇప్పుడు అదే సినిమా ఇండ‌స్ర్టీలోని మ‌హిళ‌లు ఇబ్బందుల్లో ఉంటేఎందుకు పట్టించుకోవట్లేదు అంటు ఏకి పారేసింది. ప్రపంచం అంతా ఈ విష‌యం పై చర్చించుకుంటుంటే మీరు ఇదంతా చూస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సురేష్ బాబు కొడుకు అభిరామ్ నాపై లైంగిక దాడి చేశాడ‌న్నా, అలాంటి వ్య‌క్తికి శిక్ష ప‌డేలా చేయ‌మ‌ని చెప్పు అన్నా అంటూ తను ఆవేదనకు లోనయ్యింది.

loader