శ్రీరెడ్డి ఇటీవల కాలంలో ఏ న్యూస్ ఛానెల్స్ పిలవకపోవడంతో తన దుకానం మొత్తం ఫేస్ బుక్ లోనే పెట్టింది. రోజుకో సెన్షేష‌న్‌ను రివీల్ చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంది. అంతేకాకుండా, టాలీవుడ్‌లో తెలుగు యువ‌తుల‌పై జ‌రుగుతున్న కాస్టింగ్ కౌచ్ వేధింపుల‌ను పోరాడిన విష‌యం తెలిసిందే. అంతకు ముందు, బ‌ఢా ప్రొడ్యూస‌ర్ ద‌గ్గుబాటి సురేష్‌బాబు త‌న‌యుడు త‌నను ప్రేమ పేరుతో లైంగికంగా వాడుకొని వదిలేశాడ‌ని మీడియా ముఖంగా చెప్పింది. 

 త‌న‌ను వాడుకున్న వారంద‌రిని వ‌ద‌ల‌బోన‌ని శ‌ప‌థం చేసింది శ్రీ‌రెడ్డి. అయితే, ఇటీవ‌ల ఒక లైవ్ లో శ్రీ‌రెడ్డి మాట్లాడుతూ.. న‌న్ను వాడుకుని, అవ‌మానప‌రిచిన ఏ ఒక్క‌రిని వ‌ద‌ల‌ను. నేను ద్రౌప‌ది లాంటి దాన్ని, ఆవిడ‌కు ఐదుగురు భ‌ర్త‌లే కావొచ్చు. కానీ నాకు మాత్రం అంత‌కు మించి అంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో ద్రౌప‌ది నిండు సభలో తనని అవమానించన వారిని నా భర్తలు ఎప్పుడు చంపుతారో అప్పుడే నా కొప్పును ముడివేసుకుంటా అంటు ద్రౌపది ఎలా శబథం చేసిందో. నేను కూడా నా ప్ర‌తీకారాన్ని తీర్చుకుంటానంటూ శ్రీ‌రెడ్డి ప్ర‌తిజ్ఞ చేసింది.