నన్ను బహిష్కరించకండి.. కేసీఆర్ కు శ్రీరెడ్డి విన్నపం!

sri reddy request to cm kcr
Highlights

మా అసోసియేషన్ లో కొందరు సినీ పెద్దలు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. మీరు ఈ రాష్ట్రానికి కింగ్. మీరు అర్ధం చేసుకొని సమస్యని పరిష్కరించి న్యాయం  చేయాలని కోరుతున్నాను. హైదరాబాద్ నుండి నన్ను బహిష్కరించకండి

హైదరాబాద్ రాష్ట్రం నుండి తనను బహిష్కరించవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతోంది నటి శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సెలబ్రిటీల మీద ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. తాజాగా కోలివుడ్ నటులపై కూడా కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది. సినిమా ఇండస్ట్రీలోని అమ్మాయిలను వాడుకున్న వారిలో నటులే కాదు.. రాజకీయనాయకులు కూడా ఉన్నారని తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చింది.

గత కొన్నాళ్లుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన ఫేస్ బుక్ ద్వారా కాస్టింగ్ కౌచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతోన్న శ్రీరెడ్డి మరొకసారి ఆయనను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాసింది. ''గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి.. సార్ ఇకనైనా స్పందించండి. ఎన్నిరోజులు మేము ఈ బాధలు పడాలి. డ్రగ్స్ తీసుకుంటూ.. హీరోయిన్స్ ను వాడుకునే వాళ్లలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ వారి గురించి నేను మాట్లడదలుచుకోలేదు.

ఒకవేళ మాట్లాడినా న్యాయం జరగదని నాకు తెలుసు. నన్ను చంపినా చంపేయొచ్చు. డ్రగ్స్, సెక్స్ రాకెట్ లో మీ సన్నిహితులు కూడా ఉన్నారు కాబట్టి నేను పొలిటికల్ సైడ్ రాదలచుకోలేదు. మా అసోసియేషన్ లో కొందరు సినీ పెద్దలు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. మీరు ఈ రాష్ట్రానికి కింగ్. మీరు అర్ధం చేసుకొని సమస్యని పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నాను. హైదరాబాద్ నుండి నన్ను బహిష్కరించకండి. నేను చెప్పేవన్నీ నిజాలే'' అని వెల్లడించింది.   
 

loader