పవన్ కళ్యాణ్ ను బూతు తిట్టాక అది తీవ్ర వివాదాస్పదం కావడం.. టీవీ ఛానెళ్ల చర్చల్లోనూ శ్రీరెడ్డికి  చోటు దక్కకపోవడంతో ఆమె సైలెంటుగా ఉంది. దీంతో ఆమె ఇష్యూకు తరపడినట్లే అంతా అనుకున్నారు. కానీ కొంచెం విరామం తర్వాత మళ్లీ శ్రీరెడ్డి హడావుడి మొదలైంది. ఆమె ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దానికి ఆమె లాయర్లు కూడా హాజరు కావడం విశేషం. కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఇండస్ట్రీ వ్యక్తులపై తాను కేసులు పెట్టబోతున్నట్లు శ్రీరెడ్డి ఈ ప్రెస్ మీట్లో వెల్లడించింది.

 ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది.మరోవైపు తనను కించపరుస్తూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు కూడా శ్రీరెడ్డి వెల్లడించింది. మహిళ అని చూడకుండా శ్రీరెడ్డిపై అసభ్య వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పెట్టారని.. అంతేకాకుండా ఆ వీడియోలపై అసభ్యంగా కామెంట్లు చేశారని.. వాళ్లందరినీ కోర్టుకు లాగుతామని శ్రీరెడ్డి లాయర్ తెలపడం గమనార్హం. సోషల్ మీడియాలో ఆమెను దూషిస్తూ.. బెదిరిస్తూ కామెంట్లు పెట్టిన వాళ్లందరిపై కేసులు పెట్టబోతున్నామన్నారు. ఈ కేసులో మా అసోసియేషన్ జూనియర్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఇలా ఎవరు ఆమెపై కామెంట్ చేసినా వారిపై కేసులు పెడతామని.. వారిపై క్రిమినల్.. సైబర్ యాక్ట్ కింద అభియోగాలు నమోదుచేస్తామని శ్రీరెడ్డి లాయర్ వెల్లడించారు.