శ్రీరెడ్డి లీక్స్.. ఆ డైరెక్టర్ల ఫోటోలు విడుదల

First Published 26, Mar 2018, 2:52 PM IST
Sri reddy leaking casting couch pics one by one
Highlights
నన్ను మోసం చేసింది వీళ్లే.. శ్రీరెడ్డి

రెండు వారాలు యూట్యూబ్, టీవీలలో మనకు ఎక్కువగా కనిపిస్తున్న వినిపిస్తున్న పేరు శ్రీరెడ్డి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని చేపట్టనుంది. దీంతో టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ అల్లకల్లోలం చేయనున్నాయి. ఎందుకంటే.. ఇన్నాళ్లూ టాలీవుడ్ మేనేజర్లు, పీఆర్వోలు, హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టే అమ్మాయిలను నలిపేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. తాజాగా లీక్స్ స్టార్టెడ్ అంటూ తొలి ఫోటోను పోస్టు చేసింది.

 టాలీవుడ్ ప్రముఖుల బాగోతాన్ని బయటపెడతానని శ్రీరెడ్డి హెచ్చరించిన సంగతి అందరికి తెలిసిందే. కాస్టింగ్ కోచ్‌కి సంబంధించి తన దగ్గర ఎన్నో ఆధారాలున్నాయని వాటిని  బయట పెడతానని చెప్పిన శ్రీరెడ్డి.. అన్నట్టుగానే తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పిక్ ను పోస్టు చేసింది. ఇందులో ముఖం కనిపించని ఓ వ్యక్తి శ్రీ రెడ్డిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది. అంతేగాక లీకు లు స్టాట్ అని క్యాప్సన్ కూడ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

loader