శ్రీ‌రెడ్డి, సినీ ఇండ‌స్ర్టీపై తాజాగా యుద్ధం ప్ర‌క‌టించిన తెలుగు న‌టి. త‌మిళ సినీ ఇండ‌స్ర్టీలానే, టాలీవుడ్‌లోనూ తెలుగు న‌టీ న‌టుల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని పోరాడుతున్న న‌టుల్లో శ్రీ‌రెడ్డి కూడా చేరిపోయింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవడాని గ‌ల కార‌ణాల‌ను మీడియా వేదిక‌గా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. తెలుగు న‌టీ న‌టులు నిర్మాత‌లతో, డైరెక్ట‌ర్ల‌తో, హీరోల‌తో ప‌డుకోక‌పోవ‌డ‌మే అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పింది. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న వారంతా అలా అవ‌కాశాలు చేజిక్కించుకున్న వారేనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీ‌రెడ్డి.

ఇక అస‌లు విషయానికొస్తే మోడ‌ల్ క‌మ్‌, యాంక‌ర్ క‌మ్‌, న‌టి శ్రీ‌రెడ్డి ఇవాళ ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. రాజ‌కీయ నాయ‌కుల‌తో క‌మిట్ మెంట్‌పై స్పందించింది. కాగా, ఇంట‌ర్వ్యూలో భాగంగా.. సినీ రంగంలోని డైరెక్ట‌ర్, తోటి న‌టులు, హీరోలు, ప్రొడ్యూస‌ర్లు, టెక్నీషియ‌న్స్‌తో క‌మిట్‌మెంట్ స‌రే.. మ‌రీ పొలిటీష‌న్స్‌తో కూడా క‌మిట్‌మెంట్ ఏంటండీ, వారు ఎలా అప్రోచ్ అవుతారండీ అని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స్పందించిన శ్రీ‌రెడ్డి మాట్టాడుతూ.. ఏం పొలిటీష‌న్స్ మ‌గాళ్లు కాదా..? అంటూ ఎదురు ప్ర‌శ్న వేసింది.