శ్రీరెడ్డికి ఎయిడ్స్.. తాట తీస్తా జాగ్రత్త

First Published 16, May 2018, 1:21 PM IST
Sri reddy fires on Youtube channels
Highlights

 శ్రీరెడ్డికి ఎయిడ్స్.. తాట తీస్తా జాగ్రత్త

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ కోసం పోరాటం చేస్తూ వార్తల్లో ప్రముఖంగా నిలిచిన శ్రీరెడ్డిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శల పర్వం కొనసాగుతోంది. తనపై అసత్య ప్రచారాలు, పోస్టులు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డి పై, తన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతూ కొంత మంది నీచంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ‘శ్రీరెడ్డి  ఎయిడ్స్‌తో చనిపోయిదంటూ కొంత మంది యూట్యూబ్‌లో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేశారు. నా ఫొటోలను అసభ్యకర రీతిలో పోస్టు చేస్తున్నారు’ అని శ్రీరెడ్డి పేర్కొంది. 

శ్రీరెడ్డి చనిపోయిదంటూ కొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఆమె ఎయిడ్స్‌తో చనిపోయిందని కొందరు, ఆత్మహత్య చేసుకుందని మరికొందరు పోస్టింగ్‌లు చేస్తున్నారు. తనపై కక్ష సాధించేందుకు కావాలనే కొంత మంది ఇలా చేస్తున్నారని శ్రీరెడ్డి మండిపడింది. ‘ఒక్కొక్కడి తాట వలుస్తా జాగ్రత్త. సైబర్ క్రైమ్‌లో కేసులు ఫైల్ చేశా.  ఇప్పటికి 41 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇకపై పెద్ద తలకాయల పని చెప్తా..’ అంటూ శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ అకౌంట్లో రాసుకొచ్చింది.