మీ పతివ్రత మాటలు ఆపండి..మీరు గతంలో ఏం చేశారో మాకు తెలుసు : శ్రీరెడ్డి
తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్యగా మారింది. అవకాశాల పేరుతో నూతన నటీమణులను శారీరకంగా వాడుకుంటున్నారంటూ ఇటీవల కాలంలో శ్రీరెడ్డి లాంటి వారు మీడియా సాక్షిగా ఆధారాలతో సహా బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. అయితే, క్యాస్టింగ్ కౌచ్ గురించి తాజాగా నటి పవిత్రా లోకేష్ స్పందించారు.
ఆమె పరోక్షంగా శ్రీరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ చాలా సున్నితమైన విషయం. ఆడ వాళ్లను, మగవాళ్లను, మగవాళ్లను ఆడవాళ్లు ఉపయోగించుకోవడం అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే, ఆ పని చేసే సమయంలో ఎందుకు చేస్తున్నామని ఆలోచించాలన్నారు. సినిమా రంగం చాలా చిన్న విషయం. బతకడానికి బయట చాలా పనులే ఉన్నాయి. అయినా, అందుకు ఒప్పుకునే ముందు మీ బుద్ధి ఏ మైంది..? మీరు ఒప్పుకోకపోతే.. వారెందుకు అలా చేస్తారు..? వారు అంత ధైర్యం చేశారంటే.. వారు ఎంత చనువు ఇచ్చి ఉంటారో అర్థమవుతుంది అంటూ శ్రీరెడ్డిపై పవిత్రా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
పవిత్రా లోకేష్ మాటలకు శ్రీరెడ్డి స్పందిస్తూ..ఇలా పతివ్రతలా మాట్లాడటం ఆపండి. మీరు గతంలో ఏం చేశారో మీకు తెలుసు. ఈ సమాజానికి భయపడే ఇలా మాట్లాడుతున్నారు అని శ్రీరెడ్డి తన దైన శైలిలో పవిత్రా లోకేష్‌పై ఫైర్ అయింది.
