హైదరాబాద్: తెలుగు సినీ రంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న సినీ పెద్దలకు చెప్పు దెబ్బలు తప్పవని నటి శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. 24 క్రాఫ్ట్స్ లో చోటు చేసుకున్న అక్రమాలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. 

ఆమె గత 24 గంటల్లో వరుస పోస్టులు పెట్టారు. స్టూడియోల మీద ఎంతెంత సంపాదిస్తున్నారో, డిస్ట్రిబ్యూషన్లపై పెత్తనాలు, బడా నిర్మాతల కొడుకుల అకృత్యాలు అన్నింటికీ అనని వ్యవహారాలపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. 

యూఎఫ్ఓ క్యూబ్ పేరుతో చిన్న నిర్మాతలు, నటులు, దర్శకుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న తీరును బట్టబయలు చేస్తామని అన్నారు. బయటి రాష్ట్రాలవారికి పరమాన్నం పెడుతూ స్థానికులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.

మీడియా నోరును నొక్కాలని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రపంచానికి చాటుతామని అన్నారు. ఇండస్ట్రీ పెద్దలు మారాలని, లేకుంటే వీలైనంత త్వరలోనే వారికి తన చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని అన్నారు.

మీలాంటి కుక్కలను కోర్టు బోనులో నిలబెడుతామని అన్నారు. ఎన్ని బెదిరింపులు, సెటిల్మెంట్ ఆఫర్లు ఇచ్చినా తాను లొంగబోనని అన్నారు. గత 85 ఏళ్ల ఈ తెలుగు సినిమా పరిశ్రమకు స్వాతంత్ర్యం కల్పించడంలో అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు.