మహేష్ బావమరిది గల్లా జయదేవ్ ని శ్రీరెడ్డి ఏమందంటే..

First Published 21, Jul 2018, 1:41 PM IST
sri reddy comments on tdp mp jayadev galla
Highlights

మిమ్మల్ని చూసి ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది గల్లా జయదేవ్ గారు.. పార్లమెంట్ లో మీరు ఇచ్చిన ప్రసంగం అద్భుతం. మీరు మాట్లాడుతుంటే ప్రత్యర్థుల ముఖాల్లో నెత్తుటి చుక్క కూడా లేదు.. గ్రేట్ లీడర్

అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ జయదేవ్ గల్లా గళమెత్తిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై ఆయన ఇచ్చిన స్పీచ్, కేంద్ర ప్రభుత్వం నుండి మొదలుపెట్టి రెండు రాష్ట్రాలను విడగొట్టిన అన్ని పార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు.

ఆయన స్పీచ్ లో 'భరత్ అనే నేను' సినిమా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. మహేష్ బాబుకి బావమరిది అయిన జయదేవ్ గల్లా ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడారు. ఏపీ ప్రజలు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జయదేవ్ ఇచ్చిన స్పీచ్ పై నటి శ్రీరెడ్డి కూడా స్పందించింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో రోజుకో వివాదాన్ని సృష్టిస్తోన్న శ్రీరెడ్డి మరోవైపు రాజకీయాలపై కూడా కామెంట్స్ చేస్తుంది.

ఎంపీ గల్లా జయదేవ్ ఇచ్చిన స్పీచ్ పై స్పందిస్తూ.. ''మిమ్మల్ని చూసి ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది గల్లా జయదేవ్ గారు.. పార్లమెంట్ లో మీరు ఇచ్చిన ప్రసంగం అద్భుతం. మీరు మాట్లాడుతుంటే ప్రత్యర్థుల ముఖాల్లో నెత్తుటి చుక్క కూడా లేదు.. గ్రేట్ లీడర్'' అంటూ రాసుకొచ్చింది. 

loader