'రెడ్డి డైరీ' కథ నాది కాదు.. శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 25, Aug 2018, 11:17 AM IST
sri reddy comments on reddy diary movie
Highlights

కాస్టింగ్ కౌచ్ పోరాటంతో టాలీవుడ్ లో వివాదాలు సృష్టించిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు చెన్నైకి షిఫ్ట్ అయింది. అక్కడ తారలపై కూడా ఆమె ఆరోపణలు చేసినప్పటికీ ఆమెకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి

కాస్టింగ్ కౌచ్ పోరాటంతో టాలీవుడ్ లో వివాదాలు సృష్టించిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు చెన్నైకి షిఫ్ట్ అయింది. అక్కడ తారలపై కూడా ఆమె ఆరోపణలు చేసినప్పటికీ ఆమెకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇక చెన్నైలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉంది శ్రీరెడ్డి. ఇటీవల 'రెడ్డి డైరీ' పేరుతో ఆమె తన బయోపిక్ లో నటించబోతుందంటూ వార్తలు వచ్చాయి. సినిమా ప్రారంభోత్సవ వేడుకలో శ్రీరెడ్డి ఈ బయోపిక్ పై చాలా కామెంట్స్ చేసింది.

కొన్ని వీడియోలను ఈ సినిమాలో చూపించబోతున్నానంటూ చెప్పడంతో ఆ వీడియోలు ఎవరికీ సంబంధించినవి అయి ఉంటాయని ప్రశ్నలు తలెత్తాయి. అయితే తాజాగా శ్రీరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది. అసలు 'రెడ్డి డైరీ' ఆమె బయోపిక్ కాదని స్పష్టం చేసింది. ప్రముఖ నటి జీవిత చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని ఇందులో పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నానంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

త్వరలోనే తన బయోపిక్ కూడా రూపొందుతుందని, ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది. మరి 'రెడ్డి డైరీ' తన బయోపిక్ అంటూ ముందు ప్రచారం ఎందుకు చేసుకున్నారో.. వారికే తెలియాలి! 

ఇది కూడా చదవండి.. 

టాలీవుడ్ అంత చెత్త ఇండస్ట్రీ మరొకటి లేదు.. శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు!

loader