టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం సాగిస్తున్నానని అర్ధ నగ్న ప్రదర్శనతో మొదలుపెట్టిన నటి శ్రీరెడ్డి పోరాటం అనూహ్య మలుపులు తిరిగింది. టాలీవుడ్ స్టార్లపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ కి వెళ్లింది.
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం సాగిస్తున్నానని అర్ధ నగ్న ప్రదర్శనతో మొదలుపెట్టిన నటి శ్రీరెడ్డి పోరాటం అనూహ్య మలుపులు తిరిగింది. టాలీవుడ్ స్టార్లపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ కి వెళ్లింది. అక్కడ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ లో ఆమెను పట్టించుకునేవారు లేకపోవడంతో కోలీవుడ్ లోనే సెటిల్ అయిపోవడానికి ప్లాన్ చేసింది.
ఈ క్రమంలో కోలీవుడ్ ని పొగిడే క్రమంలో టాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసింది. ''అన్ని ఇండస్ట్రీల కంటే చెత్త ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్. కేవలం నాలుగు కుటుంబాల చేతుల్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. తెలుగు సినిమా ఆడియన్స్ కూడా పెద్ద సినిమాలే చూస్తారు. అక్కడ కొత్త టాలెంట్ ని ప్రోత్సహించరు. అదే తమిళ ఇండస్ట్రీలో చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా గుర్తింపు దక్కుతుంది. జయలలిత నా రోల్ మోడల్. చెన్నైలోనే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను.
ఇక్కడ అద్దెకు ఓ ఇల్లు కూడా తీసుకోబోతున్నాను. గ్లామర్ పాత్రలు, బికినీలు వేసుకొని నటించడం నాకు ఇష్టం లేదు. మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్రల్లోనే నటిస్తాను. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. 'రెడ్డి డైరీ'తో పాటు మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాను'' అంటూ టాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అక్కడితో ఆగలేదు. తెలంగాణలో తను సురక్షితంగా ఉండలేనని, ఆ జంతువుల మధ్య నేను బతకలేనని అంటోంది.
Last Updated 9, Sep 2018, 11:53 AM IST