శ్రీరెడ్డి: పవన్ ను దూషిస్తూ నారా లోకేష్ కు సపోర్ట్!

First Published 5, Jun 2018, 12:58 PM IST
sri reddy comments on nara lokesh and pawan kalyan
Highlights

కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తోన్న నటి శ్రీరెడ్డి ఈ మధ్య రాజకీయాలను సంబంధించిన పోస్ట్ లు 

కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తోన్న నటి శ్రీరెడ్డి ఈ మధ్య రాజకీయాలను సంబంధించిన పోస్ట్ లు కూడా పెడుతోంది. 'నీకు రాజకీయాల గురించి ఎందుకు? ఎవరైనా కావాలని పోస్ట్ లు పెట్టిస్తున్నారా..? నీ పోరాటమేదో నువ్వు చేస్కో..' అంటూ కొందరు నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన శ్రీరెడ్డి మరిన్ని పోస్ట్ లు పెడుతూనే ఉంది. తాజాగా నారా లోకేష్ ను పొగడడం కోసం పవన్ ను దూషించింది.

పరోక్షంగా పవన్ గురించి ప్రస్తావిస్తూ.. ''నారా లోకేష్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేష్ ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు'' అని ఒక పోస్ట్ పెట్టింది.

అలానే పవన్ ను టార్గెట్ చేస్తూ.. ''మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికైన తరువాత ఐదేళ్లలో కేవలం ఒకే ఒక్కసారి తిరుపతికి వచ్చారని, వాళ్లకోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని, ఎక్కడా కూడా తిరుపతి అభివృద్ధి గురించి  మాట్లాడలేదని'' రాసుకొచ్చింది. 

 

 

loader