- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: తల్లికోసం వెక్కివెక్కి ఏడ్చిన దీప- ఇంట్లో నుంచి జ్యో ఎస్కేప్
Karthika Deepam 2 Today Episode: తల్లికోసం వెక్కివెక్కి ఏడ్చిన దీప- ఇంట్లో నుంచి జ్యో ఎస్కేప్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 8వ తేదీ)లో సుమిత్ర కోసం వెక్కి వెక్కి ఏడ్చిన దీప. ఇంట్లో నుంచి పారిపోయే ప్రయత్నం చేసి అందరికీ దొరికిపోయిన జ్యోత్స్న. మనుమరాలిని అనుమానించిన శివన్నారాయణ. నా ప్రమేయం లేదన్న పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో ఏడుస్తూ ఇంటికి వస్తుంది దీప. ఏమైంది దీప ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది కాంచన. కార్తీక్ ఏక్కడ? వాడు రాకుండా మీతో దీప ఎందుకు వచ్చింది అని శ్రీధర్ ని అడుగుతుంది. గురువు గారు చెప్పిన గండం వచ్చేసింది అత్తయ్య. సుమిత్రమ్మ గారి చుట్టు ముట్టింది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది దీప.
మా వదినకు ఏమైంది దీప అని కంగారు పడుతూ అడుగుతుంది కాంచన. చెల్లెమ్మకు బ్లెడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెప్పగానే కాంచన, అనసూయ షాక్ అవుతారు. కాంచన ఏడుస్తూనే ఆ వ్యాధికి ట్రీట్ మెంట్ లేదా అని అడుగుతుంది. ఉంది, కానీ మానసికంగా ధైర్యంగా ఉండాలి అని చెప్తాడు శ్రీధర్. దీప నువ్వు సుమిత్ర గురించి అంతలా ఆలోచించకు. కడుపులో బిడ్డమీద ప్రభావం పడుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్.
జ్యోత్స్న ఎస్కేప్
మరోవైపు దీప మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక్కడే ఉంటే ఈ భయంతోనే చచ్చిపోయేలా ఉన్నాను. ఎలాగో అలా ఇంట్లో నుంచి బయటపడాలి అనుకుంటుంది. వెంటనే బ్యాగులో బట్టలు సర్దుకొని మెయిన్ డోర్ దగ్గరికి వస్తుంది. ఎవ్వరూ చూడట్లేదు కదా అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే కార్తీక్ ఎదురుగా నిలబడి ఉంటాడు. షాక్ అవుతుంది జ్యోత్స్న. ఈ టైంలో ఎక్కడికి? అది కూడా బ్యాగుతో.. అని అడుగుతాడు కార్తీక్. నువ్వు ఇంటికి వెళ్లలేదా అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని ఇక్కడే ఉన్నాను అంటాడు కార్తీక్.
అడ్డంగా బుక్ అయిన జ్యో
ఎందుకు పారిపోతున్నావు జ్యోత్స్న. కొన్నిసార్లు మనల్ని ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటాం. కానీ ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు. మనం చేసిన తప్పులను బయటపెడుతూనే ఉంటారు. నీ తప్పులు, పాపాల చిట్ట సాక్ష్యాలతో సహా రెడిగా ఉంది అంటాడు కార్తీక్. వణికిపోతుంది జ్యోత్స్న. ఎక్కడికి అంటే చెప్పవేంటి అని మరోసారి అడుగుతాడు కార్తీక్. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది జ్యోత్స్న. మాకు అయినా చెప్తావా అని శివన్నారాయణ, దశరథ వస్తారు. వాళ్లను చూసి అడ్డంగా దొరికిపోయాను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న.
నువ్వు సుమిత్ర కూతురివేనా?
ఇంత రాత్రి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి బయల్దేరావు. మీ అమ్మ ఆ పరిస్థితిలో ఉందని తెలిసి కూడా నువ్వు పారిపోవాలి అనుకుంటున్నావు అంటే.. అసలు నువ్వు సుమిత్ర కూతురివేనా అని అడుగుతాడు శివన్నారాయణ. తాతా అని గట్టిగా అంటుంది జ్యోత్స్న. నీ వరుస చూస్తే ఆ అనుమానం ఎవ్వరికైనా వస్తుంది అంటాడు శివన్నారాయణ. ఏంటి నాన్న మా కూతురు మరీ ఇంత దారుణంగా ఉంది. తల్లిపై ప్రేమ లేకపోయినా పర్వాలేదు. కానీ చావుబ్రతుకుల మధ్య వదిలి వెళ్లడం ఏంటి నాన్న అని బాధపడుతాడు దశరథ. నా భార్య మానసికంగా బాధపడడానికి కారణం నువ్వే. అసలు నీ విషయంలో మేము ఏం తప్పు చేశాం జ్యోత్స్న అని అడుగుతాడు దశరథ.
ఈ ఐడియా ఇచ్చింది నువ్వేనా?
ఇంతలో పారు కిందకు వస్తుంది. ఏంటి ఈ టైంలో ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అడుగుతుంది. జ్యోత్స్నను పారిపోమని చెప్పింది నువ్వేనా అని అడుగుతాడు శివన్నారాయణ. నాకు ఏ సంబంధం లేదండి అంటుంది పారు. గదిలో కూర్చొని మమ్మీ గురించి ఆలోచిస్తుంటే భయమేసింది. ఏం చేయాలో తెలియక ఇలా వచ్చేశాను అంటుంది జ్యోత్స్న. నువ్వు ఆలోచించకుండా చేసే పనుల వల్ల మేము ఇబ్బందిపడాల్సి వస్తోంది. లోపలికి వెళ్లు అంటాడు శివన్నారాయణ.
కార్తీక్ కి థాంక్స్ చెప్తాడు శివన్నారాయణ. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక నేను ఇంటికి వెళ్తాను అంటాడు కార్తీక్. సుమిత్ర గురించి తెలిసి కాంచన, దీప ఏడుస్తూ ఉంటారు. వాళ్లకు ధైర్యం చెప్పు అంటాడు శివన్నారాయణ. ఇంటికి బయల్దేరుతాడు కార్తీక్.
ఎవరి కూతురు?
మరోవైపు ఏడుస్తూ ఉంటుంది దీప. ఇదేనా ధైర్యంగా ఉండడం అంటే అనుకుంటూ లోపలికి వస్తాడు కార్తీక్. ఏంటి బావ ఆ దేవుడు. ఒక తల్లిని పురిట్లోనే దూరం చేశాడు. అన్నీ తానై పెంచిన నాన్నను దూరం చేశాడు. చివరికి నా తల్లి సుమిత్ర అని తెలిశాక కొంచెం సంతోషపడ్డాను. జ్యోత్స్న పెళ్లై బయటకు వెళ్లాక.. నేను వాళ్ల కూతురిని అని నీతో చెప్పించాలి అనుకున్నాను.
నేను పొందలేని సంతోషం కనీసం నా బిడ్డకైనా దక్కుతుందని ఆశపడ్డాను. ఇప్పుడు చూడు అమ్మ పరిస్థితి ఎలా ఉందో అని కంటతడి పెట్టుకుంటుంది దీప. అత్తకు ఏం కాదు. కూతురు కాపాడుతుందని డాక్టర్ చెప్పారు కదా.. అంటాడు కార్తీక్. ఎవరు కూతురు? ఎవరికి కూతురు? ఎలా కాపాడుతుంది? అని దీప అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

