పవన్ కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు : శ్రీరెడ్డి

Sri reddy comments on janasena party
Highlights

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి స్థాపి్చిన ప్రజారాజ్యం పార్టీ ఎలాంటి గతి పట్టిందో జనసేన పరిస్థితి కూడా అంతే అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి స్థాపి్చిన ప్రజారాజ్యం పార్టీ ఎలాంటి గతి పట్టిందో జనసేన పరిస్థితి కూడా అంతే అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

 శ్రీరెడ్డి ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఓట్లు వేసే స‌మ‌యంలో ప్ర‌జ‌లంతా ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ను గ‌మ‌నించాల‌ని పిలుపునిచ్చింది.  సినిమాల్లో ఒక్క డైలాగ్‌ను చెప్పేందుకు 20, 30 సార్లు బ‌ట్టీప‌ట్టి మ‌రీ చెప్పే వ్య‌క్తి ప్ర‌జ‌ల‌ను ఉద్ద‌రిస్తాడంటే ఎవ‌రు న‌మ్ముతారు..? అని శ్రీ‌రెడ్డి ప్ర‌శ్నించింది. ఏదో ఒక సినిమా విజ‌యం సాధించినంత మాత్రాన.. సినిమాకు రాజ‌కీయాల‌ను జోడిద్దామ‌నుకుంటే అది మూర్ఖ‌త్వ‌మేన‌ని శ్రీ‌రెడ్డి చెప్పుకొచ్చింది. సినిమాలు వేరు, రాజ‌కీయాలు వేరు.. సినిమాల్లో డైలాగ్‌లు చెప్పిన‌ట్టు.. రాజ‌కీయ స‌భ‌ల్లో మాట‌లు చెప్పినంత మాత్రాన ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌ర‌ని శ్రీ‌రెడ్డి పేర్కొంది. ఏపీలోని ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌న‌సేన పార్టీ త‌రుపున ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తే.. త‌న అవ‌గాహ‌నా రాహిత్యం వ‌ల్ల‌ క‌నీసం వార్డు మెంబ‌ర్‌గా కూడా గెలిచే అవ‌కాశం లేద‌ని శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

loader