వ్యభిచారమా..! నాతో పడుకున్న వాళ్లు కనీసం నాకు అన్నం కూడా పెట్టలేదు : శ్రీరెడ్డి

Sri reddy comments on her arrest
Highlights

టాలీవుడ్ లో పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది నటి శ్రీరెడ్డి.  కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సెలబ్రిటీల మీద సంచలన ఆరోపణలు చేసిన ఈ నటి ఇప్పుడు కోలీవుడ్ కు వెళ్లి అక్కడ తారలపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. 

టాలీవుడ్ లో పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది నటి శ్రీరెడ్డి.  కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సెలబ్రిటీల మీద సంచలన ఆరోపణలు చేసిన ఈ నటి ఇప్పుడు కోలీవుడ్ కు వెళ్లి అక్కడ తారలపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. సుందర్ సి, లారెన్స్ వంటి తారలు శారీరకంగా తనను ఉపయోగించుకున్నారంటూ ఆమె వారిపై అభియోగాలు మోపింది. నడిగర్ సంఘం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో ఆమెపై వ్యభిచారం, డబ్బు దోపిడీ వంటి ఆరోపణలతో ఇండియన్ మక్కల్ మంద్రం(ఐఎంఎం) అనే సంస్థకు చెందిన సభ్యుడు సిటీ పోలీస్ కమీషనర్ కు కంప్లైంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు వ్యభిచారం కేసులో శ్రీరెడ్డి ని తమిళనాడులో అరెస్ట్ కూడా చేశారంటు ప్రచారం జరిగింది.

 ఈ వార్తలకు చెక్ పెడుతూ తన ఫేస్ బుక్ లో ఇలా పేర్కొనింది. " తాను అరెస్టు కాలేదని అవన్నీ అసత్య ప్రచారాలని కొట్టిపారేసింది. డబ్బుకోసం తనపేరును వాడుకుంటున్న కొన్ని యూట్యూబ్ చానెళ్లు వ్యభిచారం చేస్తున్నాయని అలాంటి చీడ పురుగుల కన్నా వ్యభిచారం చేసే అమ్మాయిలు ఎంతో మేలని ఆగ్రహం వ్యక్తం చేసింది. తానేమీ వ్యభిచారిని కాదని....తానెవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని ఆ మాటకొస్తే తనతో పడుకున్న తర్వాత....ఎవరూ కనీసం అన్నం కూడా పెట్టలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. సెక్స్ అంటే ఆడ - మగ కలిసి చేస్తారని....ముందుగా తనతో పడుకున్న మగవారిపై కూడా వ్యభిచార కేసులు పెడితే బాగుంటుందని చెప్పింది. అలా అయితే `మీ టూ` బాధితులంతా వ్యభిచారులేనని....ఆ రకంగా చూసుకుంటే మహిళలకు ఏమాత్రం రక్షణ లేని దేశంగా భారత్ పేరు ప్రపంచపటంలో మిగిలిపోతుంది", అని తెలిపింది. 

loader