మీ సినిమాల్లో అర్ధనగ్న ప్రదర్శనకు అనుమతి ఇవ్వరు కదా సార్.!

Sri reddy attacks pawan again
Highlights

శ్రీరెడ్డి పరిచయం అక్కరలేని పేరు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసేందుకు శ్రీశక్తిగా మారుతున్నానంటూ ఆ మధ్య హడావుడి చేసిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో కామ్ అయిపోయింది.

శ్రీరెడ్డి పరిచయం అక్కరలేని పేరు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసేందుకు శ్రీశక్తిగా మారుతున్నానంటూ ఆ మధ్య హడావుడి చేసిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో కామ్ అయిపోయింది. పబ్లిక్‌గా కనిపించడం మానేసింది కానీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గానే ఉంది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ఆమె చేసే పోస్ట్‌లు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య టాలీవుడ్‌లో సహజనటనతో స్టార్‌ స్టేటస్ పొందిన హీరోని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్‌పై తన ప్రతాపం చూపిస్తుంది.
 
తనని ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వాళ్ల చిట్టా మొత్తం విప్పుతానని చెబుతున్న శ్రీరెడ్డి.. మధ్యమధ్యలో జనసేనాని పవన్ కల్యాణ్‌ని మాత్రం వదలడం లేదు. ఏదో ఒక రూపంలో పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ.. పోస్టులు పెడుతూనే ఉంది. తాజాగా ఆమె మరోసారి జనసేనానిపై సంచలన వ్యాఖ్యలను సంధించింది. ఇంతకీ ఆమె చేసిన పోస్ట్ ఏమిటంటే.. ‘‘వీరనారి విభాగం గురించి మాట్లాడుతూ.. మీరు ఒక మాట అన్నారు సార్. నేను నా సినిమాల్లో అర్ధనగ్న(ఎక్స్‌పోజింగ్) సీన్స్‌కి అనుమతి ఇవ్వను. మహిళలు అంటే గౌరవం అని... గుర్తు చేద్దామని చిన్న ప్రయత్నం సార్.. సారీ’’ అంటూ పవన్ నటించిన కొన్ని సినిమాలలోని ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ మాత్రం చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. 

loader