చూడాల్సింది బట్టలు విప్పిన శరీరాన్ని కాదు... అన్యాయాన్ని : శ్రీరెడ్డి

First Published 9, Apr 2018, 4:52 PM IST
Sri reddy attack on political leaders
Highlights
చూడాల్సింది బట్టలు విప్పిన శరీరాన్ని కాదు

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ హీరోయిన్ శ్రీరెడ్డి అర్ధ నగ్నంగా నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్టులో ఆమె రాజకీయ నాయకులపై కూడా మండి పడింది. గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక యువనటి న్యాయాన్ని అర్థిస్తూ బట్టలు విప్పుకుని, నగ్నంగా నిలబడే స్థాయికి దేశాన్ని దిగజార్చిన రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు సిగ్గు పడాలి అంటూ ఆమె పోస్ట్ చేసింది. చూడాల్సింది బట్టలు విప్పిన శరీరాన్ని కాదని, జరిగిన అన్యాయాన్ని, ఆవేదనను చూడాలని కోరింది.

loader