ఆ పవన్ కళ్యాణ్ ఎలా బతుకుతాడో... ఎలా గెలుస్తాడో నేను చూస్తా : శ్రీరెడ్డి

First Published 19, Apr 2018, 11:58 AM IST
Sri reddy and junior artist thamannah phone conversation released
Highlights

ఢిల్లీలో దర్నా చేస్తా

శ్రీరెడ్డి ఇష్యూ రోజురోజుకి దుమారం లేపుతోంది. శ్రీరెడ్డి పవన్ ని తిట్టిన తరువాత బయట ఎక్కడా కనిపించలేదు. శ్రీరెడ్డి జూనియర్ ఆర్టిస్ట్ తమన్నా మధ్య ఫోన్ సంభాషణను భయటపెట్టింది. అందులో శ్రీరెడ్డి ఇలా మాట్లాడింది.సినీ ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న హీరోయిన్ శ్రీరెడ్డికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ ఇప్పుడు రాజకీయపరంగా కలకలం రేపుతోంది. తన స్నేహితురాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తమన్నాతో ఆమె ఫోన్ లో మాట్లాడుతూ, సంచలన విషయాన్ని వెల్లడించింది. వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ వేశారని... పోరాటం చేస్తున్న తనను వాడుకోవాలని ప్రయత్నించారని... వీలైతే మరింతగా నన్ను ఈ వివాదంలో ఇరికిద్దామని యత్నించారని చెప్పింది. అయితే, తన ఏడుపు చూసి, కొంచెం వెనక్కి తగ్గారని తెలిపింది. ఇటీవలి కాలంలో శ్రీరెడ్డి చేస్తున్న ఘాటు వ్యాఖ్యల వెనక ఎవరో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ సంభాషణ కీలకంగా మారబోతోందని చెబుతున్నారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ ని కూడా భూతులు తిట్టింది.ఆ పవన్ కళ్యాణ్ ఎలా బతుకుతాడో... ఎలా గెలుస్తాడో నేను చూస్తా అంటూ మాట్లాడింది. ఆ ఫోన్ సంభాషణ మీరు వినండి

                              

loader