పెళ్లిపై ఆసక్తికర సమాధానమిస్తున్న శ్రీముఖి

First Published 22, Nov 2017, 6:42 PM IST
sreemukhi inspired from salman khan
Highlights
  • తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్స్ లో శ్రీముఖి
  • శ్రీముఖికి టీవీలోనే కాక నెటిజన్లలోనూ విపరీతమైన క్రేజ్
  • పెళ్లి విషయంలో తనకు ఆ హీరోనే ఆదర్శం అని చెప్పిన శ్రీముఖి

 

తాము అభిమానించే వాళ్లు పెళ్లెప్పుడు చేసుకుంటారా, ఎవర్ని చేసుకుంటారా.. ఎవరితో ఎఫైర్ నడిపుతున్నారా.. ఇవే ఆలోచనలు కామన్ గా ఏ సెలెబ్రిటీ అభిమానికైనా వుంటాయి. అలానే యాంకర్ శ్రీముఖికి కూడా తన ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడు.. అనే ప్రశ్న పదే పదే సంధిస్తున్నారు.  ఆ.. డీటెయిల్స్ అంత ఈజీగా చెప్తారా. అందుకే పదే పదే అడుగుతుంటారు అభిమానులు.

 

తాజాగా ట్విటర్లో ఫాలోయర్లతో ఈ యాంకరమ్మ చాట్ చేసింది. ఆ సందర్భంలో చాలా మంది ఒకే ప్రశ్నను పదే పదే అడిగారు. వాళ్లంత శ్రీముఖి పెళ్లి విషయంలో తెగ ఆరా తీశారు. నువ్వు అందంగా ఉంటావ్, ముద్దుగా, బొద్దుగా ఉంటావ్.. అంటూ పొగడ్తలు ఒకవైపు రాగా, మరోవైపు పెళ్లెప్పుడు? అనే ప్రశ్న పదే పదే ఎదురైంది. దీంతో శ్రీముఖి స్పందించింది. ఇప్పుడప్పుడే ఆ ఆలోచన లేదు అనే విషయాన్ని తన స్టైల్లో చెప్పింది.
 

‘పెళ్లా.. పదే పదే ఈ ప్రశ్న ఎందుకు, పెళ్లి విషయంలో నాకు సల్మాన్ ఖానే ఆదర్శం’ అంటూ ట్వీట్లో సమాధానం ఇచ్చింది శ్రీముఖి. యాభై యేళ్ల వయసు దాటినా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ పెళ్లి ఆలోచన లేకుండా బతికేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మీకెందుకు అంత ఆసక్తి, నేను పెళ్లి చేసుకుంటే ఏంటి? చేసుకోకపోతే మీకేంటి?’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు సల్మాన్. శ్రీముఖి కూడా తనకు సల్మాన్ ఆదర్శం అంటోంది. మరి తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోరిక ఎలా తీరుతుందో ఏంటో.

loader