‘అర్జున్ రెడ్డి’ సినిమాపై యాంకర్ శ్రావ్య విమర్శలు సినిమా పేరులో రెడ్డి వాడటంపై అభ్యంతరం తలనొప్పి సినిమా అంటూ విమర్శ
'అర్జున్ రెడ్డి' సినిమాకు థియేటర్ వద్ద వసూళ్లు ఎంతబాగా వస్తున్నాయో... అదే స్థాయిలో థియేటర్ బయట వివాదాలు, విమర్శలు కూడా వస్తున్నాయి. సినిమా రిలీజ్ ముందు నుండే వి.హనుమంతరావు ఆందోళన, విడుదలైన తర్వాత కొందరు సినిమాలో బూతులు, అసభ్య పదాలు ఉన్నాయంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. హాట్ యాంకర్ అనసూయ కూడా ఇటీవల 'అర్జున్ రెడ్డి' సినిమా మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే.
ఇదే జాబితాలో తాజాగా ‘అర్జున్ రెడ్డి' సినిమాపై నటి, యాంకర్ శ్రావ్య రెడ్డి చేరారు. కాకపోతే.. ఆమె అభ్యంతరం సినిమాలోని సీన్ల మీదో, అందులో వాడిన పదజాలం మీదనో కాదట. సినిమా టైటిల్ పై అట. టైటిల్‌లో ‘రెడ్డి' అనే పదం వాడటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. సినిమా చూస్తున్నపుడు చాలా తక్కువ సందర్భాల్లో తనకు తలనొప్పి వస్తుందని.. అలాంటి తలనొప్పి తెప్పించే సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి' సినిమా ఒకటి అంటూ సినిమాపై తన అసంతృప్తిని తెలియజేసింది.
‘సినిమాలో హీరో పేరు అర్జున్ రెడ్డి దేశ్‌ముఖ్.... అంటే అతడు దేశ్‌ముఖ్. ‘రెడ్డి' లకు దేశ్ ముఖ్ అని ఉండదు. అసలు అతడు ‘రెడ్డి' కాదు... ‘దేశ్‌ముఖ్' అని తెలిపారు. ‘మీరు ఈ సినిమాకు టైటిల్ పెట్టాలంటే అర్జున్ దేశ్‌ముఖ్ రెడ్డి అని పెట్టాల్సింది, అర్జున్ రెడ్డి దేశ్ ముఖ్ కాదు...... ఐ హేట్ ఇట్.' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ఆ హీరోయిన్ ఫేసుకు అంత సీన్ లేదు
హీరోయిన్ ఫేస్ కి హీరో యుద్ధం చేయాల్సినంత గానీ, డ్రగ్ ఎడిక్ట్ అయ్యేంత సీన్ గానీ లేదు అంటూ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శాలిని పాండేను ఉద్దేశించి... శ్రావ్య రెడ్డి కామెంట్ చేసింది.
ఈ సినిమతో మీరు ఏం చెప్పాలనుకున్నారండీ డైరెక్టర్ గారు..లవ్ ఫెయిల్ అయితే లైఫ్ నాశనం చేసుకోవాలనా? అంటూ.... దర్శకుడి ని ప్రశ్నించింది.
