Asianet News TeluguAsianet News Telugu

‘స్క్విడ్ గేమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..ఇదిగో

 నెట్ ప్లిక్స్ మరింత దూకుడుగా మార్కెట్లో ముందుకు వెళ్లాలనుకుంటోంది. రీజనల్ లాంగ్వేజ్ లలో ఈ షోని అందించటం ద్వారా మరింత మందికి చేరువ కావచ్చు అని భావిస్తోంది.

Squid Game will be made available for streaming in Telugu
Author
Hyderabad, First Published Nov 18, 2021, 10:12 AM IST

‘స్క్విడ్ గేమ్’... ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే టాపిక్.  చాలా మంది నెటిజన్స్ నోట వినిపిస్తోన్న మాట ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్టవటమే కలిసొచ్చింది. ఓ రిస్కీ రియల్ లైఫ్ గేమ్ ఆధారంగా స్టోరీ నడుస్తుంటుంది. ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన ‘స్క్విడ్ గేమ్’ లాభాలు,వ్యూస్ లోనూ రికార్డ్ లకి తెర తీసింది.  నెట్‌ఫ్లిక్స్ కంపెనీ అంతర్గత లెక్కల ప్రకారం సదరు షో విలువ 900 మిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారట. ఈ నేపధ్యంలో నెట్ ప్లిక్స్ మరింత దూకుడుగా మార్కెట్లో ముందుకు వెళ్లాలనుకుంటోంది. రీజనల్ లాంగ్వేజ్ లలో ఈ షోని అందించటం ద్వారా మరింత మందికి చేరువ కావచ్చు అని భావిస్తోంది.

ఈ క్రేజీ వెబ్ సిరీస్  ప్రస్తుతం తెలుగులోకి డబ్బింగ్ అవుతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను తెలుగు ట్రైలర్ విడుదల చేస్తూ నెట్ ఫ్లిక్స్ తెలిపింది. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్న ఈ “స్క్విడ్ గేమ్” సిరీస్ తెలుగు, తమిళ, హిందీ భాషలలోకి డబ్బింగ్ జరుగుతోంది. డబ్బింగ్ కు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి కాగానే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఇంగ్లీష్ లో చూడటం కష్టమై ఈ వెబ్ సిరీస్ ను మిస్ అయ్యిన తెలుగు ప్రేక్షకులకు ఈ డబ్బింగ్ చూడటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మీరూ ఈ ట్రైలర్ ని చూడవచ్చు.

గతంలో “మనీ హేస్ట్” వెబ్ సిరీస్ విషయంలోనూ నెట్ ఫ్లిక్స్ ఇదే రకంగా డబ్బింగ్ చేసి వదిలింది. ముందుగా ఒరిజినల్ భాషలలో విడుదల చేసి సంచలనం అయిన తర్వాత ఇండియన్ భాషలలోకి ఈ సిరీస్ ను డబ్ చేసి ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. ఇపుడు ‘స్క్విడ్ గేమ్’ కూడా ‘మనీ హేస్ట్’ను ఫాలో అవుతుందన్న మాట!

Also read RRR vs Bheemla nayak: పవన్ ధీమా అదే... అందుకే ఆర్ ఆర్ ఆర్ తో ఢీ!
 
ఇక నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా బోలెడు విలువ జత చేసిన ‘స్క్విడ్ గేమ్’ నిర్మాణానికి కేవలం 21 మిలియన్ డాలర్ల బడ్జెట్ అవసరమైంది. అంటే, 150 కోట్లు వెచ్చించి డిజిటల్ స్ట్రీమింగ్ జెయింట్ ఏకంగా 6 వేల కోట్లకు పైగా లాభం పొందిందన్నమాట! ‘స్క్విడ్ గేమ్’ మారిపోతోన్న ప్రపంచ వినోద రంగపు తీరుతెన్నులకి సుస్సష్టంగా అద్దం పడుతోంది.

Also read అంచనాలు పెంచేస్తున్న RRR రచయిత.. అంత కాన్ఫిడెన్స్ కు కారణం..

Follow Us:
Download App:
  • android
  • ios