MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • OTT Movies: గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాప్ 8 మూవీస్.. అస్సలు మిస్ కాకుండా ఓటీటీలో చూడాల్సిందే

OTT Movies: గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాప్ 8 మూవీస్.. అస్సలు మిస్ కాకుండా ఓటీటీలో చూడాల్సిందే

గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న టాప్ 8 మూవీస్ లిస్ట్ ఈ కథనంలో ఉంది. ఏ సినిమాని ఏ ఓటీటీలో చూడాలి అనే వివరాలు కంప్లీట్ గా ఉన్నాయి. రాజు వెడ్స్ రాంబాయి నుంచి కోర్ట్ వరకు తప్పకుండా ఓటీటీలో చూడాల్సిన సినిమాలు అవి. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 07 2026, 09:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

గతేడాది 2025లో విడుదలైన చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది. గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాప్ 8 మూవీస్ లిస్ట్ ఈ కథనంలో ఉంది. ఇవన్నీ ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు. ఏ మూవీ ఏ ఓటీటీలో ఉందో కంప్లీట్ డీటెయిల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం లాంటి పెద్ద సినిమాలు గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
రాజు వెడ్స్ రాంబాయి
Image Credit : Asianet News

రాజు వెడ్స్ రాంబాయి

ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించారు. ఈ చిత్రం యువతని మెప్పించి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు గద్దర్ అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎక్కడ చూడాలి : ఈటీవి విన్

39
తండేల్
Image Credit : netflix

తండేల్

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ మంచి విజయం సాధించింది. ఆంధ్రాకి చెందిన జాలర్లు పాకిస్తాన్ లో చిక్కుకుపోయిన సంఘటనల ఆధారంగా దర్శకుడు చందూ ముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ఈ మూవీకి గద్దర్ అవార్డు దక్కింది.

ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్

49
దండోరా
Image Credit : Asianet News

దండోరా

శివాజీ, నందు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కింది. మంచి సందేశాత్మక చిత్రంగా ఆకట్టుకుంది. గద్దర్ అవార్డ్స్ లో ఈ మూవీ ఉత్తమ ద్వితీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

59
లిటిల్ హార్ట్స్
Image Credit : Film

లిటిల్ హార్ట్స్

గతేడాది యువతని విపరీతంగా ఆకట్టుకున్న యూత్ ఫుల్ మూవీస్ లో లిటిల్ హార్ట్స్ ఒకటి. ఈ మూవీలో హీరో మౌళి తనూజ్, హీరోయిన్ శివాని నాగారం పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. ఉత్తమ ఫీచర్ ఫిలిం డెబ్యూ విభాగంలో ఈ చిత్రానికి గద్దర్ అవార్డు దక్కింది.

ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్

69
సంక్రాంతికి వస్తున్నాం
Image Credit : Social Media

సంక్రాంతికి వస్తున్నాం

గతేడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరెకెక్కిన ఈ మూవీ గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచింది.

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో

79
మిరాయ్
Image Credit : instagram

మిరాయ్

యువ హీరో తేజ సజ్జా ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మిరాయ్ చిత్రం. సూపర్ హీరో మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో తేజ సజ్జా అదరగొట్టారు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రం గద్దర్ అవార్డు గెలుచుకుంది.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్

89
కోర్ట్
Image Credit : google

కోర్ట్

నేచరుల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ప్రియదర్శి, హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో శివాజీ నటన హైలైట్. ఈ చిత్రానికి ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రంగా గద్దర్ అవార్డు దక్కింది.

ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్

99
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
Image Credit : Asianet News

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

గద్దర్ అవార్డుల్లో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి రెండు కేటగిరీల్లో అవార్డులు లభించాయి. ఉత్తమ తృతీయ చిత్రంగా ఈ మూవీకి గద్దర్ అవార్డు లభించింది. ఈ చిత్రంలో నటించిన మాస్టర్ రోహన్ కి ఉత్తమ బాల నటుడిగా గద్దర్ అవార్డు దక్కింది.

ఎక్కడ చూడాలి : జీ 5

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఓటీటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
Dubai: దుబాయ్‌లో ఏడ్చింది, ఇప్పుడు బికినీలో రచ్చ.. సోనాల్ చౌహాన్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు
Recommended image2
నా కొడుకు చిరంజీవికి అభిమాని, మా మధ్య చిచ్చు పెట్టాలని చూసింది వాళ్లే.. మోహన్ బాబు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved