అంచనాలు పెంచేస్తున్న RRR రచయిత.. అంత కాన్ఫిడెన్స్ కు కారణం..

సినీలోకం మొత్తం ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే థియేటర్ల వద్ద చాలా రోజుల తర్వాత కొత్త కళ కనిపిస్తోంది.

Sai Madhav Burra sensational comments on RRR movie success

సినీలోకం మొత్తం ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే థియేటర్ల వద్ద చాలా రోజుల తర్వాత కొత్త కళ కనిపిస్తోంది. కానీ మునుపటిలా నిర్మాతలు కాన్ఫిడెన్స్ గా థియేటర్స్ లో సినిమాలు విడుదల చేయలేకున్నారు. చిత్ర పరిశ్రమలో జోష్ ని నింపాలంటే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా అవసరం. దీనితో యావత్ దేశం చిత్ర పరిశ్రమ మొత్తం ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. 

జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న RRR Movie ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో, నాటు నాటు సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. Ram Charan, NTRలని ఒకే ఫ్రేమ్ లో వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు అందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయి మాధవ్ బుర్రా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంపై సాయిమాధవ్ కాన్ఫిడెన్స్ అంచనాలు మరింత పెంచేలా ఉంది. 

ఆర్ఆర్ఆర్ చిత్ర విజయానికి హద్దులు లేవు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా అంత పెద్ద హిట్ అవుతుంది.. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి గారు కథ చెప్పినప్పుడే సినిమా ఎలా ఉండబోతోందో నేను ఊహించేసుకున్నాను అని సాయి మాధవ్ అన్నారు. సాయిమాధవ్ ఈ చిత్రంపై అంతా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సాయి మాధవ్ అంతలా కాన్ఫిడెంట్ గా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది రాజమౌళి సినిమా. 

వెండితెరపై తెలుగు సినిమాకు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసుకుంటూ అంతర్జాతీయ ఖ్యాతి పొందారు రాజమౌళి.  చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

Also Read:EVK: రాజా రవీంద్రకు కోటి రూపాయలు తెచ్చి పెట్టిన ఆ మూడు ప్రశ్నలు ఇవే, మీకు ఆన్సర్స్ తెలుసా?

Alluri Seetharamaraju, Komaram Bheem యుక్తవయసులో ఉన్నపుడు రెండుమూడేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోయారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీం ఆ సమయంలో అనుకోకుండా ఒకరినొకరు కలుసుకుని స్నేహితులుగా మారితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ మొత్తం కల్పితంగా ఉంటుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios