మహేష్ స్పైడర్ టీజర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అభిమానులను మెప్పించేలా 59 సెకన్ల అద్భుతమైన టీజర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 31న టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్, మురుగదాస్ ల చిత్రం స్పైడర్ గత కొంత కాలంగా ఫ్యాన్స్ ను చిరాకు పెడుతోంది. స్పైడర్ ఫస్ట్ లుక్ కోసం చాలాకాలంపాటు వెయిట్ చేసిన అభిమానులు అనుకున్న రేంజ్ లోనే ఆ ఫస్ట్ లుక్ ఉండటంతో కూరల్ అయ్యారు. అయితే... మళ్లీ రిలీజ్ డేట్ వాయిదా పడటం.. రీ షూట్ల కోసం సమయం ఎక్కువగా వెచ్చించడం అభిమానులను నిరాశ పరుస్తోంది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు సినిమా రాకుంటే ఇమేజ్ కు డ్యామేజ్ అయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే... ఎలాగైనా సూపర్ స్టార్ సినిమా సూపర్ హిట్ కావాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకుని క్వాలిటీ ప్రాడక్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. దీంతో రిలీజ్ సెప్టెంబర్ కు పోస్ట్ పోన్ అయింది.
తాజా సమాచారం ప్రకారం ‘స్పైడర్’ ఫస్ట్ టీజర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ నెల 31న ప్రేక్షకుల్ని పలకరించబోతోందట. 59 సెకన్ల నిడివితో ఈ టీజర్‌ను తీర్చిదిద్దినట్లు సమాచారం. తన టీజర్లు.. ట్రైలర్ల విషయంలో చాలా శ్రద్ధ పెట్టే మురుగదాస్.. ‘స్పైడర్’ టీజర్‌ను కూడా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ టీజర్ చూశాక సినిమా విషయంలో ఉన్న నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోతుందని.. సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతాయని అంటున్నారు.
‘స్పైడర్’ క్లైమాక్స్ చిత్రీకరణ ఇటీవలే పూర్తి కాగా.. ఇంకో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. మరోవైపు వీఎఫెక్స్ వర్క్‌తో పాటు మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సెప్టెంబర్లో విడుదలవుతుంది.
