దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన స్పైడర్ మహేష్,మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ చిత్రం ఈ మూవీకి 150 కోట్ల గ్రాస్, అయినా బయ్యర్లకు భారీ నష్టాలే

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'స్పైడర్' మూవీ రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో స్పైడర్ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా అనుకున్నంతగా నెంబర్స్ నమోదు చేసుకోలేకపోతోంది.

అయితే స్పైడర్ చిత్రం తాజాగా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 150 కోట్లను క్రాస్ అయినట్లు నిర్మాత ఠాగూర్ మధు అఫీషియల్‌గా ప్రకటించారు. బాక్సాఫీసు వద్ద 12 రోజుల్లోనే ఈ చిత్రం భారీ మొత్తం వసూలు ననమోదు చేసిందని, ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేయడం ఆనందంగా ఉందని, ఇంత భారీ కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన ప్రేక్షకులకు, మహేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నిర్మాత ఠాగూర్ మధు ప్రకటించారు.

స్పైడర్ మూవీ మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. మహేష్ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన చిత్రం కూడా ఇదే. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 72 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్కును అందుకుంది. నెగెటివ్ టాక్ వచ్చినా.. మహేష్ బాబు సినిమాలపై ఫ్యామిలీ ప్రేక్షకులకు ఉన్న ఆసక్తే ఇంత భారీ కలెక్షన్ రావడానికి కారణమైంది.

 ‘స్పైడర్' మూవీ ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌ లోనే 1 మిలియన్‌ డాలర్లకుపైగా కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. సినిమా రూ. 150 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడానికి కారణం కేవలం మహేష్ బాబే అని అంటున్నారు. ఆయనకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వల్లే ఇది సాధ్యమైందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినా... స్పైడర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వచ్చే పరిస్థితి మాత్రం లేదని అంటున్నారు. సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు చేయడమే దీనికి కారణంగా చెప్తున్నారు.