సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకతిగా వెలుగొందిన కథానాయకి నమిత. తమిళ ప్రేక్షకులు ఆమె గ్లామర్‌కు నీరాజనం పట్టి గుడి కూడా నిర్మించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నమిత ఇటీవల ప్రేమించిన వీరాను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొన్నది. ఇటీవల ఓ య్యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

 

తనకు నాగార్జున అంటే చాలా ఇష్టమని, తొలిసారి ఓ హీరోను చూసి అభిమానించింది. ప్రేమించింది నాగార్జుననే అంటోంది. 9 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఖుదాగవా చిత్రంలో నాగార్జునను చూసి ఫిదా అయిపోయాను. భగవంతుడు నా కోరికను విని నాగ్ లాంటి ఫీచర్స్ వుండే వీరాను భర్తగా ఇచ్చాడేమో అంది నమిత.

 

అంతే కాదు అభిమానులు నాకు గుడి కట్టడాన్ని తను ముమ్మాటికి సమర్ధిస్తానంది. “అది వారి ప్రేమకు అది గుర్తు. నాపై ఉన్న అభిమానాన్ని నేను కాదనలేను. అందుకే వారు నాకు గుడికట్టారు. తన ప్రేమను చాటుకోవడానికి షాజహాన్ తాజమహల్ కట్టాడు. అలాంటిదే ఇది. అందుకే నాపై ప్రేమ నేను ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటాను. వారితో ఎప్పటికప్పుడూ మాట్లాడుతుంటాను. నా ఆరోగ్యం బాగా లేకున్నా వారు అడిగితే వెంటనే ఫొటో దిగుతాను. యాటిట్యూడ్ చూపించను. అందుకే నా అభిమానులు నాపై ఎంతో ఎంతో ప్రేమ కురిపిస్తారు” అంది నమిత.

 

గతంలో తనను ఓ అభిమాని పెళ్లి చేసుకుందామని కిడ్నాప్ కూడా చేశాడని నమిత తెలిపింది. నా జీవితంలో ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది. నా అభిమాని ఒకరు నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ ఘటన 2009లో జరిగింది. నేను షూటింగ్‌‌లో పాల్గొనేందుకు కోయంబత్తూరుకు వెళ్లాను. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మీ డ్రైవర్‌ను నేనే అని ఓ వ్యక్తి వచ్చాడు. నేను, మేనేజర్ నిజమే అనుకొని వాహనంలో ఎక్కి కూర్చున్నాం. నేను హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటల వింటూ నిద్రపోయాను. అభిమాని కిడ్నాప్ చేసి పెళ్లి.. ఎంతకీ మేము చేరుకోవాల్సిన స్పాట్ రాకపోవడంతో అనుమానం వచ్చింది. డ్రైవర్ విచిత్ర ప్రవర్తన కూడా సందేహం కలిగించింది. అంతలోనే నా వాహనాన్ని ఐదారు వాహనాలు వెంటాడాయి. ఆ తర్వాత ఏమిటని అడిగితే మీరు కిడ్నాప్ అయ్యారు అని నా మేనేజర్ చెప్పాడని తెలిపింది.

 

నమిత తన జీవితంలో ఇప్పటిదాకా రెండుసార్లు సూసైడ్ చేసుకోవాలనుకొందట. ఎన్నో ఏళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమించిన నమిత అతనితో ఎడబాటు రావడంతో నేను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నానే ఫీలింగ్ కలిగింది. లవ్ బ్రేకప్ జరగడంతో సినిమా అవకాశాలు పూర్తిగా కోల్పోయాను. సుమారు నాలుగు నెలలు ఇంటి నుంచి బయటకు రాలేదు. మానసికంగా కుంగిపోయాను. అలాంటి పరిస్థితుల్లో ఈ జీవితం వద్దనుకొన్నాను.

 

లవ్ బ్రేకప్ జరిగిన సమయంలో నేను సూసైడ్ చేసుకోవాలనుకొన్నాను. ఓ రోజు ఏడంతస్తులు అపార్ట్‌మెంట్ మీద నుంచి దూకి చావాలనుకొన్నాను. కానీ ధైర్యం చాలాలేదు. ధైర్యం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో నా బాధ్యతలు గుర్తు వచ్చాయి. నా కుటుంబం గుర్తొచ్చింది. వెంటనే ఆ ప్రయత్నం మానుకొన్నాను. మరోసారి కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నాను. ఒక్కోసారి మూడు నిద్ర మాత్రలు తెచ్చుకొని మొత్తం 60 స్లీపింగ్ పిల్స్ సిద్ధం చేసుకొన్నాను. కానీ ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకొన్నాను.

 

అలా నా బ్రేకప్ జరిగి నేను పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్న సమయంలోనే వీరాతో పరిచయం అయింది. ఆ సమయానికి వీరాకు కూడా బ్రేకప్ జరిగి బాధలో ఉన్నాడు. అలా మా మధ్య జరిగిన పరిచయం వల్ల పాత విషయాలను మరిచిపోయాం. మా మనసులు కలిశాయి. బిగ్‌బాస్ రియాలిటీ షో నుంచి వచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకొంటాను అని వీరా ప్రపోజ్ చేశాడు అని నమిత వెల్లడించింది.