మరో బయోపిక్ ట్రైలర్.. హాకీ ప్లేయర్ గా తాప్సీ!

soorma movie trailer talk
Highlights

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ 

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు భాషల్లో కూడా బయోపిక్ లను రూపొందిస్తున్నారు. తాజాగా హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవితం ఆధారంగా దర్శకుడు షాద్ అలీ 'సూర్మ' అనే సినిమాను రూపొందించాడు. హాకీ లెజెండ్ గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ జీవితం ఎన్నో మలుపులతో కూడి ఉంటుంది. భారత్ తరఫున ఆడి ఎన్నో విజయాలు సాధించిన ఆయన నడుమ భాగానికి బుల్లెట్ తగలడంతో వీల్ చైర్ కు పరిమితం కావాల్సివస్తుంది.

ఆ సమయంలో అందరూ అతడిని మర్చిపోతారు. అయినా తనలో ఆత్మవిశ్వాసం మాత్రం చావదు. కష్టపడి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతాడు. ఈ అంశాలన్నీ కూడా ట్రైలర్ లో చూపించారు. దిల్జీత్ దోసంజ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తాప్సీకు మంచి పాత్ర దక్కింది. హాకీ ప్లేయర్ గా ముఖ్య పాత్రలో కనిపించనుంది. జూలై 1౩న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

loader