మస్త్ జబర్ధస్త్ మాస్  బీట్ కు ఊరమాస్ స్టెప్పులేశాడు రవితేజ. ఖిలాడి సినిమా నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు టీమ్. రిలీజ్ అవ్వడంతోనే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది సాంగ్.

రవితేజ- డింపుల్ హయతి- మీనాక్షి చౌదరి జంటగా రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నసినిమా ఖిలాడి. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా ద్వారా మీనాక్షీ చౌదరి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. పక్కా రవితేజ స్టైల్ మాస్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. 2022 పిబ్రవరి 11న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈమూవీ నుంచి వరుసగా ప్రమోషనల్ వీడియోస్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రెండు పాటలు రీలీజ్ చేయగా.. ఆ రెండు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ రోజు మూడో సింగిల్ ను రిలీజ్ చేశారు టీమ్. దేవిశ్రీ ప్రసాద్ ఖిలాడి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే అంటూ గమ్మత్తైన లిరిక్స్ తో సాగే పాటను సమీరా భరద్వాజ్ తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ పాడారు. సమీరా స్వీట్ వాయిస్ కు దేవీశ్రీ హస్కీవాయిస్ తోడై సాంగ్ దడదడలాడిపోయింది.

YouTube video player

అసలే దేవిశ్రీ బీట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మాస్ సినిమాలు అంటే దేవీకి ఎక్కడ లేని ఊపు వస్తుంది. ఇక రవితేజ్ లాంటి మాస్ హీరోకి.. అది కూడా మాస్ సాంగ్ అంటే.. రెచ్చిపోయాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. దీనికి తోడు శేఖర్ మాస్టార్ డాన్స్ కంపోజింగ్ లో సాంగ్ అదరగోట్టింది. ఆడియన్స్ ను అలరిస్తుంది. యూత్ కు వెంటనే కనెక్ట అయ్యేలా ఉన్న ఈ సాంగ్ ఫ్యూస్ తో దూసుకుపోతోంది.

Also Read : Mahesh Babu: దుబాయ్ లో మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో జాయిన్ అయిన స్టార్ డైరెక్టర్

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రవితేజ. 50 ఏళ్ళు దాటినా.. తగ్గేదేలే అంటున్నాడు. ఖిలాడి తో పాటు మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉనాయి. మరోరెండు కథలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు రవితేజ. ఖిలాడి తరువాత వెంటనే.. రామారావు ఆన్ డ్యూటీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడు రవితేజ.

Also Read : Liger first glimpse: ఫియర్ లెస్ డేంజరస్ ఫైటర్ గా విజయ్ దేవరకొండ... పూరికి మరో బ్లాక్ బస్టర్!