పూరి మార్క్ టేకింగ్ తో లైగర్ గ్లింప్స్ సాగింది. నిమిషం వ్యవధిలోనే సినిమా ఎలా ఉండనుందో చెప్పేశాడు. విజయ్ దేవరకొండ ఫియర్ లెస్ అండ్ డేంజరస్ ఫైటర్ గా కనిపిస్తున్నారు. ఆయన యాటిట్యూడ్ పీక్స్ లో ఉంది.
న్యూ ఇయర్ 2022 (New Year) కానుకగా లైగర్ ఫస్ట్ గ్లింప్స్ (Liger first glimpse)విడుదల చేశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పూరి మార్క్ టేకింగ్ తో లైగర్ గ్లింప్స్ సాగింది. నిమిషం వ్యవధిలోనే సినిమా ఎలా ఉండనుందో చెప్పేశాడు. విజయ్ దేవరకొండ ఫియర్ లెస్ అండ్ డేంజరస్ ఫైటర్ గా కనిపిస్తున్నారు. ఆయన యాటిట్యూడ్ పీక్స్ లో ఉంది.పనిలో పనిగా లైగర్ కథపై కూడా హింట్ ఇచ్చేశాడు పూరి. ముంబై మురికివాడల్లో రఫ్ గా పెరిగిన ఓ కుర్రాడు దేశం మెచ్చిన ఫైటర్ గా ఎలా ఎదిగాడు అనేదే కథగా తెలుస్తుంది. మొత్తంగా ఫస్ట్ గ్లింప్స్ తోనే మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు పూరి.
ఇక పూరి (Purijagannadh)మార్క్ డైలాగ్స్ లైగర్ మూవీకి ప్రధాన ఆకర్షణ కానున్నాయి అనడంలో సందేహం లేదు. ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండను మాత్రమే చూపించారు. అలాగే విడుదల తేదీ కూడా ప్రకటించడం జరిగింది. ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గా ప్రపంచంవ్యాప్తంగా లైగర్ విడుదల కానుంది.బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లైగర్ మూవీలో భాగస్వామిగా ఉన్నారు.
లైగర్ సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు అవుతుంది. పూరి కెరీర్ లో ఇంత సమయం ఏ మూవీకి కేటాయించలేదు. ఈ జాప్యంలో పూరి ప్రయత్న దోషం ఏమీ లేదు. నెలల కొద్దీ కొనసాగిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ముందుకు జరగలేదు. విదేశాలలో అనుకున్న షెడ్యూల్స్ కి ఆటంకం ఏర్పడింది. ఈ కారణాల చేత లైగర్ షూటింగ్ ఆలస్యమైంది. లైగర్ మూవీ అప్డేట్స్ కూడా చాలా అరుదుగా వస్తున్నాయి. అయితే న్యూ ఇయర్ కానుకగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి పూరి టీమ్ బిగ్ ట్రీట్ ఇచ్చారు.
Also read Valimai Trailer: అబ్బురపరిచేలా ఛేజింగ్ సీన్లు, విజువల్స్.. అజిత్ తో సై అంటున్న కార్తికేయ
ధర్మ ప్రొడక్షన్స్ పూరి కనెక్ట్స్ బ్యానర్ తో కలిసి లైగర్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. మణిశర్మ లైగర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

