శ్రీదేవి ఇంట పెళ్లి భాజ

First Published 24, Mar 2018, 1:46 PM IST
Sonam kapoor to marry Anand ahuja
Highlights
  • శ్రీదేవి విషాదాన్ని అధిగమించేందుకు తాజా శుభకార్యం జరుగుతుంది
  •  అనిల్ కపూర్ కుమార్తె.. సోనమ్ కపూర్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు

శ్రీదేవి విషాదాన్ని అధిగమించేందుకు తాజా శుభకార్యం జరుగుతుంది. శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కుమార్తె.. టాప్ హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఆసక్తికర కథనాన్ని ఒక మ్యాగ్ జైన్ ప్రముఖంగా ప్రచురించింది.

32 ఏళ్ల సోనమ్ కపూర్ ఇప్పటికే తన బాయ్ ఫ్రెండ్ కమ్ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాతో గడిచిన కొంత కాలంగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఓకే అనేసిన వైనం బయటకు వచ్చింది.  అన్ని అనుకున్నట్లు జరిగితే మే 11 లేదంటే మే 12 తేదీల్లో సోనమ్ పెళ్లి జరుగుతుందని చెబుతున్నారు. అతిధులు వచ్చేందుకు వీలుగా ఫ్లైట్ టికెట్స్ ను ఇప్పటికే బుక్ చేసినట్లుగా తెలుస్తోంది.

loader