విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి మూడు వారాల్లో 50 కోట్లు వ‌సూల్ చేసిన అర్జున్ రెడ్డి ఈ మూవీలో క‌ట్ చేసిన కొన్ని సిన్స్ ని మ‌ళ్లి క‌లుపుతున్న‌ర‌ట
దేశ విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులనే కాదు సినీ విమర్శకుల మదిని కొల్లగొట్టిన చిత్రం అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురుస్తుంది. దీంతో అర్జున్ రెడ్డి చిత్రం కలెక్షన్ల పరంగా రూ. 50 కోట్ల వసూళ్లు దాటి పోయింది. తొలుత ఈ చిత్రం వివాదాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. దాంతో రూ. 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
మూడు వారాలు దాటినా ఈ చిత్ర కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకపోవడం సిని పండితలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.విడుదలైన నాటి నుంచి ఈ చిత్రం చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. యూఏస్ లో ఈ చిత్రం అద్బుతాలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. అర్జున్ రెడ్డి చిత్రం విడుదలైన మూడో వారానికే అక్కడ 1, 681, 996 డాలర్లు వసూళ్లు చేసిందని (రూ. 10.75 కోట్లు ) చెప్పారు. భవిష్యత్తులో తెలుగు సినిమా గతిని మార్చే చిత్రంగా అర్జున్ రెడ్డి నిలిస్తుందని తరణ్ ఆదర్శ్ ట్విట్ చేశారు
ఇప్పటికే నటన పరంగా హీరోహీరోయిన్లు అర్జున్ రెడ్డి, షాలినీ పాండేతోపాటు చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాంగోపాల్ వర్మ, ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అయితే సందీప్ ను ఆకాశానికి ఎత్తేయడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.
ఈ చిత్రం ఘన విజయం వైపు దూసుకుపోతున్న నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ ప్రముఖ దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రంలో దాదాపు 40 నిమిషాల నిడివి గత చిత్రాన్ని కలపబోతున్నట్లు చెప్పారు. చిత్ర నిడివిని తగ్గించే ప్రసక్తే లేదు. నిడివి తగ్గించడం తప్పేనని అనిపిస్తున్నది అని అన్నారు
నిడివి ఎక్కువ అవుతుందనే కారణంతో విడుదలకు ముందు ఈ చిత్రానికి కీలకంగా మారిన కొన్ని సన్నివేశాలను తొలగించాం. అర్జున్ రెడ్డికి నిడివి ఏ మాత్రం సమస్య కాదని ప్రేక్షకులు తేల్చేశారు. కాబట్టి ఈ చిత్రానికి అదనంగా కొత్త సన్నివేశాలను చేర్చడానికి ప్రయత్నాలు చేపడుతున్నట్లు విజయ్ తెలిపారు.
