'ఒక్క రాత్రికి నీ రేట్ ఎంత'.. నటి ఫైర్!

Sofia Hayat gives a befitting reply to a pervert
Highlights

సినిమా తారలకు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి

సినిమా తారలకు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. కొందరు అభిమానం అనే పేరుతో వారిపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తుంటారు. తాజాగా నటి సోఫియా హయత్ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉండే సోఫియాను ఓ అభిమాని.. 'ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటావని' అడిగాడు.

అంతే ఈ ప్రశ్నతో సహనం కోల్పోయిన సోఫియా అతడికి బదులిస్తూ.. ఇదే ప్రశ్న నీ తల్లిని, సోదరిని, భార్యని అడగమని ధీటుగాచెప్పింది. దీంతో రెచ్చిపోయిన సదరు నెటిజన్.. 'వాళ్లు నీలాగా ఒళ్ళు చూపించరు.. గో టు హెల్' అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై స్పందించిన సోఫియా.. ''నీ తల్లి నీకు జన్మనిచ్చినప్పుడు ఒళ్ళు చూపించే ఉంటుంది. బార్లా చాపుకున్న కాళ్ళ మధ్య నుండే నువ్ వచ్చవనే సంగతి మర్చిపోవద్దని' బదులిచ్చింది. 

పవిత్రమైన రంజాన్ మాస్లో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలరని నిలదీసింది. ఆ మాటల యుద్ధం కాస్త ముదరడంతో సదరు నెటిజన్ తన అకౌంట్ ను తాత్కాలికంగా నిలిపివేశాడు.

loader