నూతన్ నాయుడు కామన్ మ్యాన్ కాదు.. ఆ హీరోయిన్ కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో తెలుసా..?

social activist siva sensational comments on nutan naidu
Highlights

మా డబ్బు కోసం అతడి ఆఫీస్ కి, ఇంటికి చాలా సార్లు తిరిగాం. ఈ క్రమంలో అతడి ఇంటి యజమానితో మాట్లాడినప్పుడు నూతన్ ఒక హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడానికి రూ.35 లక్షలు ఖర్చు పెట్టినట్లు చెప్పారు.

బిగ్ బాస్ సీజన్ 2 లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు రెండు వారాలకే బయటకి వచ్చేశాడు. అయితే రీఎంట్రీలో మళ్లీ హౌస్ లోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే అతడు కామన్ కాదని, చాలా మందికి బినామీ అని, కాస్ట్లీ కార్లలో తిరుగుతుంటాడని సామాజిక కార్యకర్త శివ ఆరోపిస్తున్నారు. నూతన్ ఫోన్ ఆడియో టేపును కూడా రిలీజ్ చేశారు. డబ్బు కోసం ఎంతో మందిని మోసం చేసిన వ్యక్తిని ఇప్పుడు సెలబ్రిటీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు.

''నూతన్ నాయుడు ఓ పొలిటికల్ లాబీయిస్ట్. ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిస్తానని చెప్పి మా వద్ద రూ.3 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడు. బాలకృష్ణ, భువనేశ్వరిల పేర్లు చెప్పి మమ్మల్ని నమ్మించాడు. దేవుడు అతడిచ్చిన పెద్ద వరం మాయ మాటలతో పక్కవాళ్లను నమ్మించడం. నూతన్ కామన్ మ్యాన్ కాదు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. పెద్ద కాన్వాయ్ చుట్టూ బౌన్సర్లతో పర్యటిస్తుంటాడు. అతడిని కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ షోకి ఎలా ఎంపిక చేశారు. మెంటర్ టెక్నాలజీస్ పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసిన అతడి అకౌంట్ డీటైల్స్ బయటకు వస్తే గుట్టు బయటపడుతుంది.

మా డబ్బు కోసం అతడి ఆఫీస్ కి, ఇంటికి చాలా సార్లు తిరిగాం. ఈ క్రమంలో అతడి ఇంటి యజమానితో మాట్లాడినప్పుడు నూతన్ ఒక హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడానికి రూ.35 లక్షలు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. రాజకీయంగా పాపులర్ అవ్వడం కోసమే అతడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. త్వరలోనే అతడిపై కేసు పెడతాం. డబ్బు తిరిగి ఇవ్వకుంటే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రప్పిస్తాం'' అని అన్నారు. ప్రస్తుతానికి నూతన్ బిగ్ బాస్ హౌస్ లో ఉండడంతో ఈ ఆరోపణలపై ఆయన స్పందించే ఛాన్స్ లేదు. సో ఈ మ్యాటర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి!

loader