బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ని కించపరుస్తూ నటుడు వివేక్ ఒబెరాయ్ వివాదాస్పద మీమ్ ని షేర్ చేశాడు. ఐష్ గతంలో కొందరు హీరోలతో డేటింగ్ చేసిన విషయాలకు ఇప్పటి ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తో పోలుస్తూ చేసిన మీమ్ ని వివేక్ షేర్ చేయడం కొందరికి షాక్ ఇచ్చింది.

దీంతో చాలా మంది సెలబ్రిటీలు, నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. ఒక అభిమాని ఏకంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా పెట్టింది. దీంతో వివేక్ ఆ ట్వీట్ ని తొలగించి.. క్షమాపణలు చెప్పాడు. అయినప్పటకీ అతడిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.

తాజాగా ఓ ఛారిటీ ఆర్గనైజేషన్(స్మయిల్ ఫౌండేషన్) వివేక్ ఒబెరాయ్ ను తమ ఈవెంట్ షో నుండి తప్పించింది. ఈ సందర్భంగా స్మయిల్ ఫౌండేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. 

అందులో.. ''వివేక్ ఒబెరాయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ని దృష్టిలో పెట్టుకొని స్మయిల్ ఫౌండేషన్ అతని సెలబ్రిటీల జాబితా నుండి పక్కనపెట్టింది. మా సంస్థ మహిళా సాధికారతకు పాటుపడుతుంటుంది. వివేక్ స్టేట్మెంట్ మా ఆలోచనాతీరుకు సరిపడదు'' అంటూ రాసుకొచ్చింది. మరి దీనిపై వివేక్ ఒబెరాయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి!

ఐశ్వర్యారాయ్ ని అవమానించిన హీరో!

మరొకరి భార్యపై అసభ్యంగా.. హీరోకి బుద్ది చెప్పిన స్టార్ హీరోయిన్!

ఫ్యాన్స్ దెబ్బకు క్షమాపణలు చెప్పిన హీరో