బాలీవుడ్ స్టార్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ ట్వీట్ కారణంగా ఎప్పుడు లేని విధంగా నెగిటివ్ కామెంట్స్ అందుకున్నాడు. ఒకప్పుడు స్టార్ హీరోతో గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న ఐశ్వర్య రాయ్ వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా వివేక్ చేసిన మీమ్ ట్వీట్ సెలబ్రెటీలకు సైతం ఆగ్రహాన్ని రప్పించింది. 

నెటిజన్స్ వివేక్ పై నెగిటివ్ కామెంట్స్ తో కుమ్మేశారు.  మహారాష్ట్రలో ఒక అమ్మాయి వివేక్ చేసిన ట్వీట్ కారణంగా అతనిపై కేసు కూడా నమోదు చేసింది. దీంతో వెంటనే వివేక్ ఆ ట్వీట్ ని డిలీట్ చేసిన వివేక్ క్షమాపణలు కోరాడు.

సరదాగా అనిపించిన ఒక విషయం కొందరికి బాధ కలిగించవచ్చు. నేను చేసిన ట్వీట్ కారణంగా మహిళలు బాధపడుతున్నారు. అందుకే క్షమించమని కోరుతున్నా.. ఇన్నేళ్ల కెరీర్ లో ఏ మహిళతో  కూడా నేను తప్పుగా వ్యవహరించలేదు. ఆ ట్వీట్ ను డిలీట్ చేస్తున్ననని వివేక్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు.