బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రూ. 3కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారట. సల్మాన్-కత్రినా మంచి స్నేహితులు. కత్రినా పరిశ్రమకు వచ్చిన నాటి నుండి సల్మాన్ తో ఆరోగ్యకరమైన రిలేషన్ కొనసాగిస్తున్నారు.
బాలీవుడ్ క్రేజీ కపుల్... విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ బర్వార పోర్ట్ లో ఘనంగా వివాహం జరిగింది. ఈ పెళ్ళికి అతికొద్ది మంది బాలీవుడ్ సెలెబ్స్ మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకలు ముగించుకున్న నూతన వధూవరులు ముంబైలోని నూతన గృహానికి చేరుకున్నారు. కాగా వీరి పెళ్ళికి రాకపోయినా... బాలీవుడ్ సన్నిహితులు, స్నేహితులు ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇస్తున్నారు. సల్మాన్, రన్బీర్ కపూర్, హృతిక్ రోషన్ కత్రినా-విక్కీ కౌశల్ కి ఇచ్చిన గిఫ్ట్స్ టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యాయి. కోట్ల విలువ చేసే సదరు ఖరీదైన బహుమతుల గురించి తెలుసుకున్న సామాన్యులు... ఔరా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రూ. 3కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారట. సల్మాన్-కత్రినా మంచి స్నేహితులు. కత్రినా పరిశ్రమకు వచ్చిన నాటి నుండి సల్మాన్ తో ఆరోగ్యకరమైన రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఏక్తా టైగర్, భారత్, టైగర్ జిందాహై వంటి హిట్ చిత్రాలు తెరకెక్కాయి.
బాలీవుడ్ లవర్ బాయ్ రన్బీర్ కపూర్ సైతం కత్రినాకు అత్యంత విలువైన గిఫ్ట్ ఇచ్చారట. ఆయన రూ. 2.7 కోట్ల విలువైన వజ్రాల హారం బహుమతిగా అందించారట. వీరిద్దరూ కూడా పలు చిత్రాలలో కలిసి నటించగా.. కొన్నాళ్లు ప్రేమాయణం సాగించారు. ఇక బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రూ. 1.5 లక్షల ఖరీదు చేసే పెయింటింగ్ గిఫ్ట్ గా ఇచ్చారట. మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ రూ. 3 లక్షల విలువైన బీఎండబ్ల్యూ బైక్ కానుకగా ఇచ్చారని సమాచారం. ఈ నలుగురు సెలెబ్రిటీలు ఇచ్చిన గిఫ్ట్స్ విలువ ఐదున్నర కోట్ల రూపాయలు దాటిపోయింది.
Also read పెళ్లి కూతురు డ్రెస్‌లో అనుపమా హోయలు.. షాక్‌లో అభిమానులు.. గుండె పగిలిపోతుందంటూ గగ్గోలు
దాదాపు మూడేళ్ళుగా డేటింగ్ చేస్తున్న విక్కీ కౌశల్, కత్రినా ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కత్రినా కెరీర్ బిగినింగ్ లో టాలీవుడ్ లో చిత్రాలు చేశారు. వెంకటేష్, బాలయ్యకు జంటగా మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాలలో నటించారు. బాలీవుడ్ లో బిజీ అయ్యాక ఆమె టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు.
Also read Pushpa Review:అల్లు అర్జున్ ‘పుష్ప - ది రైజ్’ రివ్యూ
