- Home
- Entertainment
- పెళ్లి కూతురు డ్రెస్‌లో అనుపమా హోయలు.. షాక్‌లో అభిమానులు.. గుండె పగిలిపోతుందంటూ గగ్గోలు
పెళ్లి కూతురు డ్రెస్‌లో అనుపమా హోయలు.. షాక్‌లో అభిమానులు.. గుండె పగిలిపోతుందంటూ గగ్గోలు
క్యూట్ అందాల భామ అనుపమా పరమేశ్వరన్ అభిమానులకు షాకిచ్చింది. ఊహించిన విధంగా ముస్తాబై ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో ఫ్యాన్స్ తల్లడిల్లి పోతున్నారు. ఇలా అయితే మా హార్ట్ బ్రేక్ అవడం ఖాయమంటున్నారు. మరి అనుపమా ఏం చేసింది?

అనుపమా పరమేశ్వరన్ పెళ్లి కూతురు దుస్తుల్లో ముస్తాబైంది. బ్రైడల్ లుక్‌లో ఆమె కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా పంచుకున్న అనుపమ పెళ్లికూతురులుక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వైరల్‌గా మారింది. ఇంత వరకు బాగానే ఉంది ఇందులో అనుపమ పెట్టిన కొంటె పోస్ట్ ఇప్పుడు మరింత వైరల్‌గా మారింది. ఇన్నోసెంట్ లుక్‌లో కనువిందు చేసే ఈ బ్యూటీ పెట్టిన కొంటే పోస్ట్ ఏంటనేది చూస్తే..
ఇది మీకు తెలిసిన చదరంగం లాంటిది. రాణి.. రాజుని కాపాడుతుంది. దీంతో ఆయన్ని తన వశం చేసుకుంటుంది.. హేహేహే.. `అంటూ పోస్ట్ పెట్టింది అనుపమా. జనరల్. రాణిని రాజు కాపాడి, ఆమెని తన వశం చేసుకుంటారు. కానీ ఇందులో రాణినే..రాజుని వశం చేసుకున్నట్టుగా తెలిపింది అనుపమా. కొంటెగా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
మరోపైపు అనుపమని ఇలా చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. కొంపతీసి పెళ్లి చేసుకుంటుందా? ఏంటి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైతే కాదు, కదా. మేం తట్టుకోలేం. మా గుండె పగిలిపోతుంది అంటూ కామెంట్లు పెట్టడం విశేషం. అనుపమాపై వారి అభిమానులకు ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక పెళ్లి కూతురు డ్రెస్సులో అనుపమా అచ్చం యువరాణిలా ఉందని చెప్పొచ్చు. అందాల దేవత దివి నుంచి దిగివచ్చిందా అనేట్టుగా ఉంది. ముగ్దమనోహరమైన రూపంతో కనువిందు చేస్తుంది. కుర్రాళ్లకి మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం అనుపమ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
అనుపమా పరమేశ్వరన్ ఇప్పటి వరకు సాంప్రదాయ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ట్రెడిషనల్ లుక్‌లోనే ఎంతో అందంగా కనిపిస్తూ అలరిస్తుంది. అనుపమా చీరలో ఎంత సెక్సీగా, హాట్‌గా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. శారీలో నడువొంపులు చూపిస్తూ హోయలు పోతుంటే కుర్రాళ్లకి పిచ్చెక్కిపోతుందంటే అతిశయోక్తి కాదు. అంతటి అందం అనుపమా సొంతం.
అయితే ఇటీవల ఈభామ గ్లామర్‌కి తెరలేపుతుంది. తాను కూడా అందాల ఆరబోతకు సిద్ధమే అని సిగ్నల్స్ ఇస్తుంది. పొట్టి దుస్తుల్లో పరువాలు పోతూ గ్లామర్ షో చేస్తుంది. తాను స్కిన్ షోకి సిద్దమే అని సాంకేతాలను ఫిల్మ్ మేకర్స్ కి ఇస్తుంది.
అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది అనుపమా. ఈ బ్యూటీ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉందని వేరే చెప్పక్కర్లేదు. ఒక్కో పోస్ట్ ని లక్షల్లో వీక్షిస్తారు. ఆమె పోస్ట్ పెట్టడమే ఆలస్యం అందుకోసమే మేం ఉన్నామనేట్టుగా అభిమానులు ఎగబడి చూస్తుంటారు. అది అనుపమాకి ఉన్న క్రేజ్,ఫాలోయింగ్.
తన ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని ఉపయోగించుకుని సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. చివరగా `రాక్షసుడు` చిత్రంలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు `18 పేజెస్`, `కార్తికేయ 2`, `రౌడీ బాయ్స్` చిత్రాల్లో నటిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ మూడు తెలుగు సినిమాలు చేస్తూ నెమ్మదిగా పుంజుకుంటోంది.
జనరల్‌గా గ్లామర్ పాత్రలు చేయని హీరోయిన్లకి అవకాశాలు తగ్గిపోతుంటాయి. కానీ అనుపమా విషయంలో మాత్రం నిజం కాదని, హీరోయిన్‌గా రాణించాలంటే గ్లామర్ ముఖ్యం కాదని, మంచి నటన, కనువిందు చేసే అందం, అభినయం ముఖ్యమని చాటి చెప్పింది అనుపమా. చీరలోనూ ఎంతో అందంగా కనిపించొచ్చనే విషయాన్ని నిరూపించింది.