బేబి సినిమా తరువాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న నిర్మాత SKN.. అంతకు మించిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈక్రమంలో SKN మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించారు.
వినూత్నంగా ఆలోచించే నిర్మాత..
జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి కల్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు ఎస్ కేఎన్. టాక్సీవాలా, బేబి వంటి చిత్రాలు ప్రొడ్యూసర్ గా ఆయన అభిరుచికి నిదర్శనంగా నిలుస్తాయి. రాజీ పడకుండా కథ కోరుకున్నవన్నీ సమకూర్చి సినిమా నిర్మించడమే కాదు ఆ చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడంలో వినూత్నంగా ఆలోచిస్తుంటారు ఎస్ కేఎన్. స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న ఈ రైజింగ్ ప్రొడ్యూసర్.. ఇప్పుడు "చెన్నై లవ్ స్టోరీ" సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల 24న "చెన్నై లవ్ స్టోరీ" సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఎస్ కేఎన్ మాట్లాడుతూ..
మన తెలుగు జంట చెన్నైలో నివసిస్తుంటారు. అందుకే చెన్నై లవ్ స్టోరీ అని సినిమా టైటిల్ పెట్టాం. బేబి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మేకర్స్ గా మాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఒక మంచి మూవీతోనే ఆడియెన్స్ ముందుకు రావాలని ఏడాది సమయం తీసుకున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ చెప్పిన ఈ కథ, కథనం బాగా నచ్చాయి. మా కాంబినేషన్ లోనే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. మేము అనుకున్న కథకు కిరణ్ అబ్బవరం వందశాతం న్యాయం చేశారు. ఆయన ఇప్పటిదాకా బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. మాస్ క్యారెక్టర్స్ లో నటించారు. కిరణ్ గారి నటనలోని ఒక మెచ్యూరిటీని ఈ సినిమాలో చూస్తారు. ఈ ఏడాది అన్ని అవార్డ్స్ లో కిరణ్ గారి పేరు నామినేషన్స్ లో ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా పేరు తెచ్చుకుని ప్రొడ్యూసర్ గా కొత్త వాళ్లను పరిచయం చేస్తూ అవకాశాలు ఇస్తున్నారు కిరణ్ గారు. ఆయన ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ ను ఈ సినిమా టైమ్ లో చూశాను అని అన్నారు నిర్మాత ఎస్ ఎస్ కే ఎన్.
ఎంత ఖర్చు పెట్టాలి అనేది నిర్మాత నిర్ణయం..
తొలిప్రేమ అయినా మలిప్రేమ అయినా మన జీవితంలో భాగమే. తొలి ప్రేమ దక్కని వారిలో మళ్లీ ప్రేమ పుట్టదని చెప్పలేం. ఏదైనా జీవితం ముందుకు సాగాల్సిందే. బేబి సినిమాను తొలి ప్రేమ నేపథ్యంగా నిర్మించాం. ఈ సినిమాలో మలి ప్రేమ కూడా గొప్పదే అని చెబుతున్నాం. మూవీలో విషాదకరంగా ఉండదు. బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్ల సమయం తీసుకుని మేము ఈ చిత్రాన్ని నిర్మించామంటే మాదైన ఒక మార్క్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. కథను నమ్మి ఆ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి అనేది ప్రొడ్యూసర్ నిర్ణయం. ఇది ఎమోషన్స్ తో ఆకట్టుకోవాల్సిన కథ. ఆ ఎమోషన్స్ కోసం విజువల్ బ్యూటీ అవసరం. అందుకోసం నేచురల్ గా ఆ విజువల్స్ వచ్చేవరకు ఆగి షూటింగ్ చేశాం అని ఆయన అన్నారు.

క్లాసిక్ లవ్ స్టోరీ అవుతుంది
బేబి సినిమాకు కల్ట్ లవ్ స్టోరీ అని పేరొచ్చింది. ఈ సినిమాకు క్లాసిక్ లవ్ స్టోరీ అనే పేరొస్తుంది అన్నారు నిర్మాత ఎస్ కేఎన్. ''ఈ కథ విన్న వెంటనే మణిశర్మ గారు మా మూవీ చేస్తానని ఒప్పుకున్నారు. ఆయన చేసిన పాటలు ఎంత బాగుంటాయో మనకు తెలుసు. ట్యూన్ ఆకట్టుకుంటూనే లిరిక్స్ అర్థమవుతాయి. ఈ సినిమాలో అనంత శ్రీరామ్ సింగిల్ కార్డ్ రాశారు. ప్రతి లిరిక్ అర్థమయ్యేలా పాటను ఎంజాయ్ చేయొచ్చు. కథలోని భావోద్వేగాలు తెలిసేలా మెచ్యూర్డ్ గా మ్యూజిక్ చేయడంలో తనకు తానే సాటి అని మణిశర్మ గారు మరోసారి ప్రూవ్ చేసుకున్నారు'' అని అన్నారు.
వివాదానికి ఛాన్స్ లేకుండా..
డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. ''డైరెక్టర్ రవి నంబూరి మాకు సోదరుడి లాంటి వారు. ఆయన మాతో ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నారు. మాకు వెబ్ సిరీస్ స్టోరీ ఇచ్చారు. బేబి మూవీకి వర్క్ చేశారు. ఆయనతో ఈ సినిమా నిర్మించడం హ్యాపీగా ఉంది..అర్జున్ రెడ్డి, యానిమల్, బేబి ..ఇలాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ ఎప్పుడు వచ్చినా కొన్ని వివాదాలు వస్తుంటాయి. "చెన్నై లవ్ స్టోరీ"లో అలాంటి వివాదాస్పద కంటెంట్ ఉండదు. ఇది ఎక్కువగా ఎమోషనల్ డెప్త్ మీద వెళ్లే కథ. ఓటీటీలు సినిమాల రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేయడం అనేది జరుగుతోంది. మా "చెన్నై లవ్ స్టోరీ" మూవీ ఓటీటీ డీల్ కంప్లీట్ అయ్యింది. ఆ సంస్థనే ఆ విషయాన్ని ప్రకటిస్తుంది'' అని నిర్మాత వెల్లడించారు.


