MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akkineni: అఖిల్ కు పేరు కలిసిరావడంలేదా? అక్కినేని అభిమాని చెప్పిన నేమ్ సెంటిమెంట్ సీక్రెట్ ఏంటి?

Akkineni: అఖిల్ కు పేరు కలిసిరావడంలేదా? అక్కినేని అభిమాని చెప్పిన నేమ్ సెంటిమెంట్ సీక్రెట్ ఏంటి?

Akkineni: అఖిల్ అక్కినేనికి సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి? ఆయన పేరు కలిసిరావడంలేదా? అక్కినేని హీరోల నేమ్ సెంటిమెంట్ అఖిల్ ను విజయానికి దూరం చేస్తుందా? ఓ అభిమాని చెప్పిన అసలు రహస్యం ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 07 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్పీడ్ పెంచిన అక్కినేని అఖిల్..
Image Credit : Asianet News

స్పీడ్ పెంచిన అక్కినేని అఖిల్..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. అఖిల్ గతంలో పెద్దగా మాట్లాడేవాడు కాదు, అక్కినేని అభిమానులను పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ మునుపటిలా కాకుండా కాస్త స్పీడ్ పెంచాడు. ఎక్కువగా అభిమానులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. తనను తాను నిరూపించుకనే అవకాశం ఇవ్వాలని అభిమానులను అడుగుతున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అఖిల్ పేరు కలిసిరావడంలేదా..?
Image Credit : Asianet News

అఖిల్ పేరు కలిసిరావడంలేదా..?

ప్రస్తుతం అక్కినేని అభిమానుల్లో ఓ సెంటిమెంట్ బలంగా వైరల్ అవుతోంది. అఖిల్ సక్సెస్ అవ్వకపోవడానికి నేమ్ సెంటిమెంట్ ఏమైనా పనిచేస్తుందా అన్న అనుమానం వస్తోంది. అక్కినేని హీరోల అందరికి పేరుకు ముందు నాగ ఉంటుంది. కానీ అఖిల్ పేరుకి మాత్రం అది తగిలించలేదు. అందుకే ఈ యంగ్ హీరో సక్సెస్ సాధించలేకపోతున్నాడా అని అక్కినేని అభిమానులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇక ఒక వీరాభిమాని అయితే.. అఖిల్ కు కొత్త పేరు సూచిస్తూ.. ఆయన ముందే డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. తిరుపతిలో జరిగిన ఈవెంట్ లో ఆ అభిమాని మాట్లాడిన మాటలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.

Related Articles

Related image1
Bhanu Chander: బ్లూ ఫిల్మ్ కేసులో భానుచందర్ ను ఇరికించాలని చూస్తే.. కాపాడిన హీరో ఎవరో తెలుసా?
Related image2
Venkatesh: వెంకటేష్ తనయుడు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్.. దగ్గుబాటి వారసుడు మొదటి సినిమా ఏదో తెలుసా?
34
అఖిల్ కు కొత్త పేరు ప్రతిపాదించిన అభిమాని..
Image Credit : Asianet News

అఖిల్ కు కొత్త పేరు ప్రతిపాదించిన అభిమాని..

లెనిన్ మూవీ ఈవెంట్ లో అఖిల్, నాగార్జున ప్రసంగాలు అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, ఓ అక్కినేని అభిమాని చేసిన వినూత్న ప్రతిపాదన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన అభిమాన హీరో పేరు మార్చుకోవాలని సూచిస్తూ, దాని వెనుక ఉన్న సెంటిమెంట్‌ను వివరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

లెనిన్ ఈవెంట్ లో  మాట్లాడిన ఆ అభిమాని, అఖిల్ తన పేరును 'నాగ అఖిల్' గా మార్చుకుంటే బాగుంటుందని సూచించాడు. ఈ పేరు వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు. 'నాగ' అనే పదం అఖిల్ తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున పేర్ల నుంచి తీసుకున్నదని చెప్పారు. అలాగే పేరులోని 'అ' అక్షరం నానమ్మ అన్నపూర్ణమ్మ, తల్లి అమల పేర్లకు గుర్తుగా ఉంటుందని వివరించారు.

44
పెద్దల ఆశిస్సులు ఉంటాయని
Image Credit : Youtube

పెద్దల ఆశిస్సులు ఉంటాయని

ఈ విధంగా కుటుంబంలోని నలుగురు పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ అఖిల్‌కు ఉండాలనే ఉద్దేశంతో 'నాగ అఖిల్' అనే పేరును సూచిస్తున్నట్లు ఆ అభిమాని వెల్లడించారు. ఆయన మాటలు ముగిసిన వెంటనే సభలో చప్పట్లు మార్మోగాయి. అక్కడున్న అభిమానుల నుంచి కూడా ఈ ప్రతిపాదనకు సపోర్ట్ లభించింది. అక్కినేని కుటుంబంలో 'నాగ' అనే పదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నుంచి నాగార్జున, నాగ సుశీల, నాగ చైతన్య వరకు కుటుంబంలోని పలువురి పేర్లలో ఈ పదం భాగంగా ఉంది. 

నాగ పేరు ఉన్నవారంతా సక్సెస్ అయ్యారు. నాగచైతన్య కూడా తన కెరీర్ లో అద్భుతంగానే రాణిస్తున్నాడు. అఖిల్ మాత్రం కెరీర్ బిగినింగ్ నుంచి సాలిడ్ హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు. అందుకే అఖిల్ పేరుకు కూడా నాగ ను జోడించాలని అభిమానులు కోరుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. "నాగ అఖిల్ అనే పేరు బాగుంది", "అభిమాని ఆలోచన చాలా బాగుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
MGR: భాగ్యరాజ్‌ హీరో కావడం వెనుక మైండ్‌ బ్లాంక్‌ అయ్యే స్టోరీ.. విజయకాంత్‌ని పక్కన పెట్టిన ఎంజీఆర్‌
Recommended image2
Sanya Malhotra: బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టిన సాన్య.. క్రేజీ ఫోజులతో సోషల్ మీడియాలో దుమారం
Recommended image3
Rajesh Sharma: ఆసుపత్రి పాలైన ప్రముఖ నటుడు, రేవంత్ రెడ్డికి కంప్లైంట్.. అసలేం జరిగింది ?
Related Stories
Recommended image1
Bhanu Chander: బ్లూ ఫిల్మ్ కేసులో భానుచందర్ ను ఇరికించాలని చూస్తే.. కాపాడిన హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Venkatesh: వెంకటేష్ తనయుడు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్.. దగ్గుబాటి వారసుడు మొదటి సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved