MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bhanu Chander: బ్లూ ఫిల్మ్ కేసులో భానుచందర్ ను ఇరికించాలని చూస్తే.. కాపాడిన హీరో ఎవరో తెలుసా?

Bhanu Chander: బ్లూ ఫిల్మ్ కేసులో భానుచందర్ ను ఇరికించాలని చూస్తే.. కాపాడిన హీరో ఎవరో తెలుసా?

Bhanu Chander: భాను చందర్ తెలుగు,తమిళ భాషల్లో క్లాసిక్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన భాను చందర్ ను ఓ కేసులో ఇరికించాలని చూస్తే.. కాపాడిన మరో హీరో ఎవరో తెలుసా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 07 2026, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్లాసిక్ హీరోగా భానుచందర్ కు మంచి గుర్తింపు..
Image Credit : Pinterest

క్లాసిక్ హీరోగా భానుచందర్ కు మంచి గుర్తింపు..

సీనియర్ నటుడు భానుచందర్ తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. అయితే ఆయన జీవితంలో ఒకసారి జరిగిన సంఘటన అప్పట్లో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటనలో ఓ ప్రముఖ హీరో చేసిన సహాయం వల్ల భానుచందర్ పెద్ద సమస్య నుంచి బయటపడ్డారు. జైలుకు వెళ్లకుండా తనను కాపాడిన ఆ హీరో ఎవరో ఎవరో కాదు సుమన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భాను చందర్ ను జైలుకు వెళ్లకుండా కాపాడిన హీరో..
Image Credit : Asianet News

భాను చందర్ ను జైలుకు వెళ్లకుండా కాపాడిన హీరో..

భాను చందర్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ఆయన మరెవరో కాదు హీరో సుమన్. టాలీవుడ్ కు సుమన్ ను పరిచయం చేసింది భానుచందరే. వీరి స్నేహం చాలా స్ట్రాంగ్. ఎన్ని సమస్యలు వచ్చినా..ఎంత మంది ఎన్ని అన్నా.. ఈ ఇద్దరు మాత్రం ఒక్క మాటమీదఉంటుంటారు. ఓ సారి సుమన్ ఓ పెద్ద కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. బ్లూ ఫిల్మ్స్ ఆరోపణలతో సుమన్ పై పెద్ద పెద్ద కేసులు పెట్టి జైలుకు పంపడంతో పాటు భాను చందర్ ను కూడా ఈ కేసులో ఇరికించాలని చూశారట. కానీ తెలివిగా భాను చందర్ కు ఈ ఇబ్బందులు ఎదురు కాకుండా సుమన్ కాపాడినట్టు ఇద్దరు హీరోలు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.

Related Articles

Related image1
Krishna: ఎన్టీఆర్ మాటను ఎదిరించి, పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా, కురుక్షేత్రం రివ్యూ...
Related image2
Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్
35
స్నేహితుడి చేతిలో మోసపోయిన సుమన్..
Image Credit : Asianet News

స్నేహితుడి చేతిలో మోసపోయిన సుమన్..

తెలుగులో హీరోగా మంచి ఫామ్ లో ఉండగా.. సుమన్ కెరీర్ లో ఒక్క సారిగా కుదుపు వచ్చింది. సుమన్‌పై కేసు నమోదు కావడం, అనంతరం జైలుకు వెళ్లడం ఆయన ఫిల్మ్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ వ్యవహారం తర్వాత ఆయన సినిమా జీవితం గట్టిగా దెబ్బతింది. తరువాత కాలంలో హీరోగా చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఆ సినిమాలు చేసి ఉంటే.. ఆయన టైర్ 1 హీరోల లిస్ట్ లోకి వచ్చేవాడని అంటుంటారు. బ్లూ ఫిల్మ్ ఆరోపణలతో పాటు ఆయనపై గుండా యాక్ట్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో పేరువినిపించగా.. అందులో నిజం లేదని.. ఇదంతా తన స్నేహితుడు దివాకర్ చేసిన పని అని.. అతని చేతిలో తానుమోసపోయానని సుమన్ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.

45
భాను చందర్ ను కాపాడిన సుమన్..
Image Credit : ETV

భాను చందర్ ను కాపాడిన సుమన్..

అయితే ఈ కేసులో సుమన్ కు ప్రాణ స్నేహితుడైన భానుచందర్ ను కూడా ఇరికించాలని ప్రయత్నాలు జరిగాయట. అయితే వాటిని ముందుగానే గుర్తించిన సుమన్ భానుచందర్ ను కాపాడాలని ప్రయత్నించారట. ఎప్పుడైతే తనపై ఈ కేసులు పెట్టారో.. అప్పటినుంచి కొన్నినెలలు పాటు తనకు ఫోన్ చేయొద్దని, తనతో మాట్లాడొద్దని భానుచందర్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడటన సుమన్. ఈ విషయాన్ని భాను చందర్ ఓ ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పారు. తాను జైలుకు వెళ్లకుండా సుమన్ కాపాడాని భాను చందర్ అన్నారు.

55
సుమన్ స్నేహానికి భానుచందర్ ఫిదా..
Image Credit : our own

సుమన్ స్నేహానికి భానుచందర్ ఫిదా..

భాను చందర్ ఈమధ్య కాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. సుమన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. సుమన్ నా స్నేహితుడు కావడం అదృష్టం. మా బంధం చాలా బలమైనది. ఎప్పుడు నా మంచి కోరకుంటుంటాడు. ఓ సారి నేను కార్ లో వెళ్తుంటే.. సడెన్ గా ఓ కారు స్పీడ్ గా వచ్చి నా కారు ముందు ఆగింది. నేను వెంటనే వెళ్లి ఎవడ్రా నువ్వు.. అంటూ కోపంగా బయటకు వచ్చాను . కారులోంచి సుమన్ బయటు దిగాడు. ఏంట్రా ఇది.. ఈ స్పీడ్ ఏంటి.. ఏమైపోతావు అంటూ అరిచాను. అప్పుడు వెంటనే వాడు నాతో ఓ మాట అన్నాడు. 

నేను కొన్ని ఫేక్ కేసుల్లో ఇరుక్కున్నాను. అందులో నిన్ను కూడా ఇరికించే ప్రమాదం ఉంది. ఇక నుంచి కొన్ని నెలలు నాకు ఫోన్ చేయకు, మాట్లాడుకు, మెసేజ్ చేయకు అని అన్నాడు. అతను ఎంత గొప్ప స్నేహితుడు కాకపోతే ఇలా మాట్లడుతాడు. ఇంకొకరైతే నాఫ్రెండ్ భాను అని చెప్పి కేసులో ఇరికించేవారు. కానీ సుమన్ అలా చేలేదు'' అని భాను చందర్ ఎంతో గొప్పగా చెప్పారు. కానీ సుమన్ ఎం చెప్పినా.. భాను చందర్ మాత్రం బయట ఉండి సుమన్ ను ఎలా రక్షించాలా అని ప్లాన్ చేసేవారట.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Kapoor Wedding: పెళ్లి వేడుకలో అర్జున్ కపూర్ ని ఆట పట్టించిన చెల్లెల్లు, వైరల్ వీడియో
Recommended image2
Jr NTR: పవన్ కి మహేష్, అఖిల్ కి ఎన్టీఆర్.. థ్యాంక్యూ టైగర్ అంటూ అక్కినేని హీరో ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Related Stories
Recommended image1
Krishna: ఎన్టీఆర్ మాటను ఎదిరించి, పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా, కురుక్షేత్రం రివ్యూ...
Recommended image2
Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved